లేని సమస్యలు సృష్టించొద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్

బీజింగ్: అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది చైనా. అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడి క్వాడ్ కూటమిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది. లేని సమస్యలు సృష్టించొద్దని, వీలైతే ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతకు సహకరించండని సూచించింది. చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ రెన్ గువోకియాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. క్వాడ్ సమావేశంలో తాము చైనా విసురుతున్న సవాళ్లపై చర్చించినట్లు అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సల్లివాన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇలా స్పందించారు. ఇండో, పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరత కోసం తాము ప్రయత్నిస్తామని ఈ మధ్యే జరిగిన తొలి క్వాడ్ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పిన విషయం తెలిసిందే.
కోల్డ్ వార్ మనస్తత్వం
అయితే ఈ క్వాడ్ కూటమిని తాము వ్యతిరేకిస్తున్నట్లు రెన్ స్పష్టం చేవారు. అమెరికా ప్రమోట్ చేస్తున్న ఈ క్వాడ్ వాళ్ల కోల్డ్ వార్ మనస్తత్వానికి అద్దం పడుతోందని ఆయన అన్నారు. ఇది ఒక జట్టుగా ఘర్షణకు దిగడమే అవుతుంది. క్వాడ్ భౌగోళికరాజకీయ ఆటలకు తెరలేపింది. చైనా సవాలు పేరుతో ఇలా సమూహాలను ఏర్పాటు చేస్తున్నారు. చైనా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అని రెన్ అన్నారు. ఈ కాలంలో శాంతి, అభివృద్ధి, ఇరు వర్గాల లబ్ధి పొందడమే లక్ష్యంగా పని చేయాలని, అలా కాకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ట్రెండ్‌కు విరుద్ధంగా వెళ్లడం సరి కాదని ఆయన స్పష్టం చేశారు. తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి అమెరికా అందరినీ శత్రువులగా మార్చుకోవడం, లేని ముప్పును ఊహించుకోవడం చేస్తోందని రెన్ విమర్శించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

