కో-విన్ రిజిస్ట్రేషన్ కు దివ్యాంగుల గుర్తింపు కార్డే ఫోటో ఐడి: కేంద్ర ఆరోగ్య శాఖ

ఢిల్లీ ,జూన్ 7: వాక్సిన్ ప్రక్రియను సరళతరం చేసేందుకు ,దానిని క్రమపద్ధతిలో కొనసాగించేందుకు కేంద్రప్రభుత్వం నిరంతర కృషి చేస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో ప్రత్యేక దివ్యాంగ గుర్తింపు (యుడిఐడి ) కార్డులను కోవిన్ 2.0 లో నమోదుకు ఫోటో గుర్తింపు కార్డుగా వినియోగించవచ్చని సూచించింది. 2021 మార్చి 2 న విడుదలైన కో-విన్ 2.0 కు మార్గదర్శకాల్లో ఆరు ఫోటో ఐడి కార్డులను సూచించారు. వాక్సినేషన్‌కు ముందు పరిశీలనకోసం ఈ జాబితా ఇచ్చారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకుఆ రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇందుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ, సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వశాఖ, దివ్యాంగులకు సాధికారత కల్పించే విభాగం వారికి జారీచేసిన యుడిఐడి కార్డులలో అవసరమైన అన్ని వివరాలు అంటే పేరు , పుట్టిన తేదీ, స్త్రీ లేదా పురుషుడు అన్న సమాచారం, ఆ వ్యక్తి ఫోటో వంటివన్నీ ఉన్నాయని, కోవిడ్ -19 వాక్సినేషన్ కు అవసరమైన గుర్తింపునకు ఇవి పనికివస్తాయన తెలిపారు.
దివ్యాంగులకు వాక్సినేషన్ అందుబాటులో ఉండేట్టు చేసేందుకు కోవిడ్ -19 వాక్సినేషన్‌కు నిర్దేశించిన గుర్తింపుకార్డుల జాబితాలో యుడిఐడిని చేర్చడం జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రొవిజన్ కల్పిస్తున్నారు. దీనిని కోవిన్‌లో త్వరలోనే అందుబాటులోకి తెస్తారు.యుడిఐటి కార్డు ను కోవిడ్వాక్సిన్వేయించుకునేందుకుగుర్తింపుకార్డుగావినియోగించవచ్చన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిందిగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Coronavirus
- Covin
- disabled
- photo id
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

