కృష్ణ ప్రశంసించారు

‘సినిమా హీరో కావాలని కలలుకనే ఓ యువకుడి కథ ఇది. ఇప్పటివరకు ఎవరూ స్పృశించని కొత్త పాయింట్‌తో సినిమాను తెరకెక్కించాం’ అని అన్నారు శ్రీరామ్ ఆదిత్య. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘హీరో’. అశోక్ గల్లా కథానాయకుడు. పద్మావతి గల్లా నిర్మించారు. ఈ నెల 15న విడుదలకానుంది. శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ ‘రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన కథ, కథనాలతో సాగుతుంది. ఆద్యంతం నవ్వుల్ని పంచుతుంది. సినిమాల ప్రభావం సమాజంలోని చాలా మందిపై కనిపిస్తుంటుంది. హీరో అనే మాటతో ప్రతిఒక్కరికి అనుబంధం ఉంటుంది. ఆ అంశాల నుంచి స్ఫూర్తి పొందుతూ ఈ కథ రాసుకున్నా. అశోక్ గల్లాకు తొలి సినిమా అయినా పరిణతితో కూడిన అభినయాన్ని కనబరిచారు. కౌబాయ్‌గా, జోకర్‌గా భిన్న గెటప్‌లలో అశోక్ కనిపిస్తాడు. అభినయపరంగా నిధి అగర్వాల్‌కు ఈ సినిమా మంచి పేరుతెచ్చిపెడుతుంది. సీనియర్ హీరో కృష్ణగారు ఈ సినిమా చూసి ప్రశంసించారు. పండుగకు తెలుగు ప్రేక్షకులకు పరిపూర్ణ వినోదాన్ని పంచే సినిమాగా నిలుస్తుంది’ అని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
Jupally Krishna Rao | మంత్రి జూపల్లిని విమర్శించారని.. యువకుడిని చితకబాదిన ఎస్సై
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

