నేనలా అనలేదు.. మీడియాలో తప్పుగా వచ్చింది: సీజే బొబ్డే

న్యూఢిల్లీ : లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని ఫిర్యాదుదారును వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అని అడిగిన తరువాత.. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి జస్టిస్ బొబ్డే ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. నిందితుడి న్యాయవాదికి అడిగిన ప్రశ్నలు ఆ కేసులోని వాస్తవాలలో ఉన్నాయని, అయితే మీడియాలో తప్పుగా నివేదించడం జరిగిందని బొబ్డే అభిప్రాయపడ్డారు. ఒక సంస్థగా సుప్రీంకోర్టుకు ఎల్లప్పుడూ స్త్రీత్వంపై అత్యున్నత గౌరవం ఉన్నదని చీఫ్ జస్టిస్ ఎస్ఐ బొబ్డే సోమవారం అన్నారు.
గత వారం లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని ఫిర్యాదుదారును వివాహనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అంటూ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించినట్లు అన్ని మీడియాలో వార్తలు ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. ‘ఒక సంస్థగా, ఈ కోర్టులోని ధర్మాసనానికి మహిళలు అంటే అత్యన్నత గౌరవం ఉన్నది. మహిళలను సుప్రీంకోర్టు ఎప్పుడూ సముచితంగా గౌరవిస్తున్నది. ఫిర్యాదుదారును వివాహం చేసుకోవాలని నిందితుడిని నేను అడగలేదు. అయితే, ఆమెను పెండ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అని మాత్రమే ప్రశ్నించాం. అసలు విషయాలు ఇలా ఉండగా మీడియాలో అందుకు విరుద్ధంగా వార్తలు ప్రచురితమయ్యాయి’ అని సీజేఐ బొబ్డే పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై న్యాయవాదుల నుంచి, హక్కుల సంఘాల నుంచి విమర్శలు రావడంతో వివాదంపై జస్టిస్ బొబ్డే స్పందించారు. విచారణ సందర్భంగా హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీజేఐకి మద్దతుగా నిలిచారు. మార్చి 1 న విచారణ సందర్భంగా కోర్టు సమర్పించిన సాక్ష్యం ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 165 ప్రకారం పూర్తిగా సమకాలీనంగా ఉన్నదని, ఇది ఒక కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నిందితులను ప్రశ్నించేందుకు న్యాయమూర్తులకు అధికారం ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. న్యాయమూర్తులు ఈ కేసులో అలా ప్రశ్నించడం సబబుగానే ఉన్నదని, అయితే వ్యాఖ్యలు సందర్భోచితంగా విస్తృతంగా నివేదించబడ్డాయని మెహతా చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

