భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కొత్త అవతారమెత్తాడు. భారీ గ్రాఫిక్స్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ‘అథర్వ’: ద ఆరిజిన్ అనే వెబ్ సిరీస్‌లో ధోనీ సూపర్ హీరో పాత్రలో కనిపించబోతున్నాడు. యువ రచయిత రమేశ్ తమిళ్మణి నవల ఆధారంగా నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో ధోనీ అతీతశక్తులతో అలరించబోతున్నాడు. బుధవారం అథర్వ ఫస్ట్‌లుక్‌ను ధోనీ ఆవిష్కరించాడు. ఇందులో సినీ హీరోలకు తీసిపోని విధంగా ధోనీ కనువిందు చేస్తున్నాడు.