అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్
- పండుగలా జననేత జన్మదిన వేడుకలు
- కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
- ఆలయాల్లో పూజలు, పండ్లు పంపిణీ
జూబ్లీహిల్స్/అమీర్‌పేట జోన్ బృందం, ఫిబ్రవరి17: పేదల కోసం పరితపించిన ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్ అని.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పేదల స్థితిగతులు పూర్తిగా మారిపోవడమే ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలతో, అనేక అభివృద్ధి కార్యక్రమాలతో, అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ బంగారు తెలంగాణ సాధకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. గురువారం వెంగళరావునగర్ డివిజన్లోని మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాంగణంలో కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి, దేదీప్య విజయ్‌లతో కలిసి మొక్కలు నాటి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ హోమ్ పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కేక్ కట్‌చేసి, మిఠాయిలు పంచుకుని సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో వెంగళరావునగర్ డివిజన్ అధ్యక్షుడు కోనేరు అజయ్, వేణుగోపాల్ యాదవ్, శ్యామ్‌రావు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
- పేద ప్రజల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ అని బోరబండ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబాఫసియుద్దీన్ తెలిపారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా సైట్-2 లో మొక్కలు నాటిన అనంతరం బోరబండ బస్‌స్టాప్ ప్రాంగణంలో కేక్ కట్‌చేసి సంబురాలు నిర్వహించుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా బన్సీలాల్‌పేట్‌లోని సమ్మక్క సారక్క ఆలయంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశం రాజు ఆధ్వర్యంలో అమ్మవార్లకు బంగారం సమర్పించుకున్నారు. అమీర్‌పేట్‌లో టీఆర్ఎస్ నాయకులు గులాబ్‌సింగ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.
- గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తాటి,ఈత నీరా పంపిణీ పంపిణీ చేశారు. సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటీ ప్రతినిధులు అంబాల నారాయణ, భిక్షపతి, శివకుమార్, నరసింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి సీఎం కేసీఆర్ శాంతియుత ఉద్యమం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించాడని గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో పారిశుధ్య కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం మహిళా కార్మికులకు కేక్, మిఠాయిలు పంచిపెట్టి తన సొంత నిధులతో చీరెలను పంపిణీ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

