లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్

ఖమ్మం : తన భూమిని వేరేవాళ్లు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, తన భూమికి హద్దులు సర్వే చేసి చూపితే తగిన రక్షణ చర్యలు తీసుకుంటామని ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నాడు. ఇదే అదునుగా భావించిన రెవెన్యూ సిబ్బంది రైతుతో బేరసారాలకు దిగారు. రూ.1.50 లక్షలకు బేరం కుదుర్చుకొన్నారు. అందులో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్న సంఘటన జిల్లాలోని వేంసూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకున్నది.
ఏసీబీ డీఎస్పీ మధుసూదన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని తోట సాంబశివరావు, తోట తారక, తోట వసంత మహేశ్‌కు చెందిన సుమారు 25 ఎకరాల భూమి విషయంలో సరిహద్దు యజమానులైన మునీర్ మూష, ఈసాలకు కొంతకాలంగా వివాదం జరుగుతోంది.
ఈ క్రమంలో తోట సాంబశివరావు వేంసూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఇది తమ పరిధి కాదని, తహసీల్దార్ కార్యాలయంలో చూసుకోవాలని వారు తెలిపారు. దీంతో భూమి విషయాన్ని కార్యాలయంలోని డిప్యూటీ తహసీల్దార్ ఉపేందదర్, సర్వేయర్ గురవేశ్లకు వివరించగా సరిహద్దు సర్వే చేయాలంటే రూ.2లక్షలు ఇవ్వాల్సిందేనని, లేకుంటే కట్టమని తెలిపారు. చివరకు రూ.1.50 లక్షలకు బేరం కుదుర్చుకుని రూ.లక్ష ముందుగా అందజేయాలని రైతుకు డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్ తెలిపారు.
దీంతో సదరు రైతు ఖమ్మం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు..బుధవారం రైతు తన భూమి సర్వే విషయమై సర్వేయర్‌తో మాట్లాడటంతో డబ్బులను సర్వేయర్ కారు డాష్‌బోర్డులో పెట్టాలని కోరాడు. రైతు సర్వేయర్ కారు డాష్‌బోర్డులో డబ్బు పెడుతుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఈ దాడుల్లో డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్లు పట్టుబడ్డారు. వారి ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దాడిచేసిన వారిలో ఖమ్మం ఇన్స్పెక్టర్ రమణమూర్తి, వరంగల్ ఇన్స్పెక్టర్ సతీశ్క్రాంతి, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 33 గోవులు, దూడలు పట్టివేత
Kalyana Lakshmi | పెండ్లయి పిల్లలు పుట్టాక కల్యాణ లక్ష్మి చెక్కు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : వీడియో
NZvIND: సీఫర్ట్పైకి దూసుకెళ్లిన బ్రార్ .. భారత బౌలర్‌ను నియంత్రించిన కోహ్లీ
Anirudh-Kavya | ట్రెండ్‌గా మారిన అనిరుధ్-కావ్య వివాహ పద్ధతి.. అసలు ఏంటీ ‘సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్’?
Kiran Abbavaram | ‘రియాలిటీ’లో రఘుకుల తిలక పాట.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

