మెక్సికన్ పరోటా రోల్స్
బ్రకోలీ ముక్కలు: ఒక కప్పు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, క్యాప్సికం, టమాట ముక్కలు: పావు కప్పు చొప్పున, చీజ్ తురుము: ఒక కప్పు, ఉడికించిన స్వీట్‌కార్న్: రెండు టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి: అర టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్, గోధుమపిండి, మైదాపిండి: ఒక కప్పు చొప్పున, నూనె: అర కప్పు.
కావలసిన పదార్థాలు
బ్రకోలీ ముక్కలు: ఒక కప్పు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, క్యాప్సికం, టమాట ముక్కలు: పావు కప్పు చొప్పున, చీజ్ తురుము: ఒక కప్పు, ఉడికించిన స్వీట్‌కార్న్: రెండు టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి:
అర టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్, గోధుమపిండి, మైదాపిండి: ఒక కప్పు చొప్పున, నూనె: అర కప్పు.
తయారీ విధానం
ఒక గిన్నెలో మైదాపిండి, గోధుమపిండి, ఒక టేబుల్ స్పూన్ నూనె, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి పావుగంట మూతపెట్టి పక్కనపెట్టాలి. బ్రకోలీ ముక్కల్ని పది నిమిషాల పాటు ఉప్పునీళ్లలో ఉడికించి చిన్నగా తరగాలి. ఒక గిన్నెలో బ్రకోలీ, టమాట, క్యాప్సికం, ఉల్లిగడ్డ ముక్కలు, చీజ్ తురుము, స్వీట్ కార్న్, కారం, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. స్టవ్ మీద పెనం పెట్టి వేడి చెయ్యాలి. పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని చపాతీలా ఒత్తి పెనంపై వేసి ఒక నిమిషంపాటు రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. కాలిన చపాతీ మధ్యలో బ్రకోలీ మిశ్రమం పెట్టి గుండ్రంగా చుట్టి ఒక నిమిషంపాటు మూతపెడితే వేడివేడి మెక్సికన్ పరోటా రోల్స్ సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

