Drone strike | యూఏఈలో అణువిద్యుత్ కేంద్రంపై దాడి.. తీవ్రంగా ఖండించిన భారత్
Drone strike | పశ్చిమాసియా (West Asia) లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసేలా యూఏఈ (UAE) లోని బరాకా (Barakah) అణు విద్యుత్ కేంద్రం (Nuclear Power Plant) సమీపంలో డ్రోన్ దాడి (Drone strike) జరిగింది. ఇది ఇరాన్ చర్యేనని భావిస్తున్నారు. ఈ దాడి కారణంగా ప్లాంట్ ప్రాంగణంలో మంటలు చెలరేగాయి. యూఏఈకి దాదాపు 25 శాతం విద్యుత్‌ను అందించే ఈ కీలక కేంద్రంపై దాడి జరగడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
Drone strike : పశ్చిమాసియా (West Asia) లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసేలా యూఏఈ (UAE) లోని బరాకా (Barakah) అణు విద్యుత్ కేంద్రం (Nuclear Power Plant) సమీపంలో డ్రోన్ దాడి (Drone strike) జరిగింది. ఇది ఇరాన్ చర్యేనని భావిస్తున్నారు. ఈ దాడి కారణంగా ప్లాంట్ ప్రాంగణంలో మంటలు చెలరేగాయి. యూఏఈకి దాదాపు 25 శాతం విద్యుత్‌ను అందించే ఈ కీలక కేంద్రంపై దాడి జరగడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దాడిని భారత్ (India) తీవ్రంగా ఖండించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
‘యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన డ్రోన్ దాడిపట్ల భారత్ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావు. ఇవి ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తాయి. తక్షణమే ఇరుపక్షాలు సంయమనం పాటించి.. చర్చలు, దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలి’ అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. యూఏఈ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని, రేడియేషన్ స్థాయిలో ఎలాంటి మార్పులు లేదని స్పష్టంచేశారు.
పశ్చిమ సరిహద్దు నుంచి మూడు డ్రోన్లు దేశంలోకి ప్రవేశించాయని, వాటిలో ఒకటి అణు కేంద్రం లోపలి ప్రాంగణంలో పడగా, మరో రెండింటిని కూల్చివేసినట్లు తెలిపారు. ఈ దాడిని ‘అకారణంగా జరిగిన ఉగ్రవాద చర్య’ గా యూఏఈ ప్రభుత్వం అభివర్ణించింది. తమ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే ఎలాంటి చర్యలను సహించబోమని, ప్రతీకారం తీర్చుకునే పూర్తి హక్కు తమకుందని హెచ్చరించింది. దాడి జరిగిన వెంటనే యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఈజిప్ట్ సహా పలు దేశాల విదేశాంగ మంత్రులతో ఫోన్లో మాట్లాడారు.
ఈ దేశాలన్నీ దాడిని ఖండిస్తూ యూఏఈకి మద్దతు ప్రకటించాయి. యూఏఈ అధ్యక్ష సలహాదారు అన్వర్ గర్గాష్ మాట్లాడుతూ.. ఈ దాడి వెనుక ఇరాన్ లేదా దాని అనుబంధ సంస్థల హస్తం ఉండవచ్చని ఆరోపించారు. అరబ్ ప్రపంచంలో ఏకైక అణు విద్యుత్ కేంద్రమైన బరాకా ప్లాంట్‌ను దక్షిణ కొరియా సహాయంతో యూఏఈ నిర్మించింది. 2020లో ఇది కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ ప్లాంట్‌పై దాడి జరగడం ఇదే మొదటిసారి. గతంలో యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఈ ప్లాంట్‌పై దాడికి యత్నించినట్లు ప్రకటించినా, యూఏఈ దాన్ని ఖండించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Barakah
- Drone Strike
- India
- UAE
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

