పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో మరో షాక్ నమోదైంది. వరల్డ్ నెంబర్ టూ ప్లేయర్ డానిల్ మెద్వెదేవ్ నాలుగవ రౌండ్లో ఓటమి పాలయ్యాడు. క్రొయేషియాకు చెందిన మారిన్ సిలిక్ 6-2, 6-3, 6-2 స్కోర్‌తో మెద్వెదేవ్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్ మొత్తం వన్‌సైడ్‌గా సాగింది. 33 ఏళ్ల సిలిక్ తర్వాత రౌండ్లో ఏడో సీడ్ ఆండ్రూ రూబ్లేవ్తో తలపడనున్నాడు. కేవలం గంటా 47 నిమిషాల్లో సిలిక్ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. తొలి సర్వ్‌లో 90 శాతం పాయింట్లను అతను గెలిచేశాడు. తన కెరీర్లోనే ఇదో అద్భుతమైన మ్యాచ్ అని సిలిక్ తెలిపాడు.