Crow Revenge | కాకులూ పగబడతాయ్.. 17 ఏండ్లపాటు ముఖాలను గుర్తుంచుకొంటాయ్!
పాములు పగబడతాయ్ అని చెప్తారు. ఏండ్లు గడిచినా ఏనుగులు మనుషుల ముఖాలను మర్చిపోవని పరిశోధనల్లో తేలింది కూడా. అయితే, రోజూచూసే కాకులు పగబడతాయని తెలుసా? తమకు అపకారాన్ని చేసిన వ్యక్తుల ముఖాలను ఏకంగా 17 ఏండ్లపాటు గుర్తుంచుకొంటాయంటే నమ్మగలమా?
- తమకు అపాయం తలపెట్టినవారిపై కక్ష కడతాయ్
- ద్వేషాన్ని తమ వారసులకు కూడా నూరిపోస్తాయ్
- అమెరికా పరిశోధకుల బృందం తాజా అధ్యయనం
Crow Revenge | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : పాములు పగబడతాయ్ అని చెప్తారు. ఏండ్లు గడిచినా ఏనుగులు మనుషుల ముఖాలను మర్చిపోవని పరిశోధనల్లో తేలింది కూడా. అయితే, రోజూచూసే కాకులు పగబడతాయని తెలుసా? తమకు అపకారాన్ని చేసిన వ్యక్తుల ముఖాలను ఏకంగా 17 ఏండ్లపాటు గుర్తుంచుకొంటాయంటే నమ్మగలమా? అంతేకాదు, ‘మన కుటుంబానికి వాళ్లు అన్యాయం చేశారు. వదిలిపెట్టొద్దు’ అంటూ పెద్ద కాకులు తమ సంతానానికి చెప్పిమరీ తనువు చాలిస్తాయని తెలుసా? అయితే, అమెరికాకు చెందిన ఓ పరిశోధక బృందం చేసిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
పరిశోధన జరిగింది ఇలా..
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జాన్ మార్జ్లఫ్ నేతృత్వంలోని పరిశోధక బృందం సభ్యులు 2006లో ముఖానికి గోస్ట్ మాస్క్‌లను ధరించి ఓ ఏడు కాకులను వలతో బంధించారు. అనంతరం వాటికి ఎలాంటి హాని చేయకుండా విడిచిపెట్టారు. ఆ కాకుల ప్రవర్తనను విశ్లేషించడానికి విడిచిపెట్టడానికంటే ముందే ఆ కాకుల కాళ్లకు కొన్ని రింగ్స్‌ను కట్టారు. కొన్నిరోజుల తర్వాత యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆ మాస్కులను ధరించి తాము వెళ్లినప్పుడు కొన్ని కాకులు తమ వైపునకు చూస్తూ గట్టిగా అదేపనిగా అరవడాన్ని గమనించారు. తొలుత కొన్ని కాకులే ఇలా చేయగా, ఏండ్లు గడుస్తున్న కొద్ది వీటి సంఖ్య 47 వరకు చేరినట్టు తెలిపారు. చివరిసారిగా 2023 సెప్టెంబర్‌లో అంటే ప్రయోగం ప్రారంభించిన 17 ఏండ్ల తర్వాత ఇక మాస్కు ధరించిన తమ బృంద సభ్యులపై ఏ కాకి కూడా అరవకపోవడాన్ని తాము గుర్తించినట్టు వెల్లడించారు.
కాకుల సంఖ్య పెరిగింది అలా..
పరిశోధనలో భాగంగా ఏడు కాకులనే బంధించినప్పటికీ, ఒకానొక సమయంలో ఏకంగా 47 కాకులు తమ వైపు చూస్తూ ద్వేషాన్ని వ్యక్తం చేసినట్టు మార్జ్లఫ్ గుర్తుచేశారు. దీన్నిబట్టి తాము బంధించిన తల్లి కాకులు తమ సంతానానికి, బంధువులకు, సన్నిహితులకు ఆ ఉదంతాన్ని చెప్పి ఉండొచ్చని, ఈ కారణంచేతనే మాస్కు ధరించిన తమపై కొత్త కాకులు కూడా కక్ష పెంచుకొని ఉండొచ్చని మార్జ్లఫ్ అంచనా వేశారు. కాకులు గరిష్ఠంగా 20 ఏండ్లపాటు జీవనం సాగిస్తాయన్న విషయం తెలిసిందే. కాగా కర్మకాండల్లో భాగంగా పెట్టే పిండాన్ని కాకులు ఆరగించడం ఒక సంప్రదాయం. కాకులకు దివ్యదృష్టి ఉన్నదని, అవి ఆత్మలను కూడా చూడగలవని నమ్మేవారు కూడా ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

