ఇక్కడ మాస్క్ ధరించకుంటే రూ.250 జరిమానా

బెంగళూరు : కర్ణాటకలో పెరుగుతున్న కరోనా కేసులతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి చర్యలు ప్రారంభించింది. కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై చర్యలకు సిద్ధమైంది. బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) పరిధిలో ఫేస్‌మాస్క్ ధరించకుంటే రూ.250 జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వేడుకలు, కార్యక్రమాల్లో పాల్గొనే వారి సంఖ్యపై ఆంక్షలు విధించింది. వివాహ వేడుకల్లో 200 మందికి, పుట్టిన రోజు వేడుకల్లో వంద మంది, అంత్యక్రియల్లో 50 మంది పాల్గొనవచ్చని పేర్కొంది. అంతేకాకుండా ఎయిర్ కండిషన్డ్ పార్టీ హాల్స్, డిపార్ట్మెంట్ సోర్ట్స్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే భారీగానే జరిమానా విధించనున్నారు. నిన్న ఒకే రోజు కర్ణాటకలో 2,298 కొవిడ్ కేసులు రికార్డవగా.. 12 మరణాలు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,75,955కు చేరగా.. ఇప్పటి వరకు 12,461 మంది మృత్యువాతపడ్డారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

