మహమ్మారి నుంచి కాపాడాలని కరోనాకు గుడికట్టిన ప్రజలు
కరోనాకు గుడి| కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది. ప్రతి రోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఈ ప్రాణాంతక వ్యాధి తమకు రావొద్దని, ఊరి ప్రజలంతా క్షేమంగా ఉండాలని అంతాకలిసి ఓ గుడి కట్టుకున్నారు.

లక్నో: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది. ప్రతి రోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఈ ప్రాణాంతక వ్యాధి తమకు రావొద్దని, ఊరి ప్రజలంతా క్షేమంగా ఉండాలని అంతాకలిసి ఓ గుడి కట్టుకున్నారు. అందులో కరోనా మాతా అని పేరు పెట్టుకున్నారు. ప్రాణాంతక వ్యాధి బారినుంచి తమను రక్షించాలని రోజూ పూజలు చేస్తున్నారు. తమతోపాటు పక్కూరి ప్రజలకు కూడా ఎలాంటి ఆపదా రావద్దొని మొక్కకుంటున్నారు ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా శుక్లాపూర్ గ్రామ ప్రజలు.
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. ఈ మాయదారి రోగం తమ దరి చేరనీయొద్దని అనుకున్న శుక్లాపూర్ గ్రామ ప్రజలు కరోనాకు ఆలయం కట్టారు. అందులో కరోనా మాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. కరోనా మాత విగ్రహానికి మాస్కు కూడా కట్టారు. తమకు ఎలాంటి ఆపదా రానియోద్దని ప్రతిరోజు వేడుకుంటున్నారు. అదేవిధంగా గ్రామస్తులంతా మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను కచ్చితంగా పాటించాలని తీర్మానించుకున్నారు.
తమ ఊర్లో ఇలాంటి ఆలయం ఇదే మొదటిది కాదని, గతంలో ప్రజలను మసూచి పట్టిపీడించినప్పుడు కూడా మసూచి దేవాలయం కట్టుకున్నామని ఆలయ పూజారి చెప్పారు. ఇప్పుడు కరోనా మాతను ప్రతిష్టించుకున్నామని, ఆ దేవత తమను రక్షిస్తుందని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

