Collector inspections | ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
Collector inspections | నాగర్కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు.
అమ్రాబాద్: నాగర్కర్నూల్( Nagarkurnul ) జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy) , రాష్ట్ర మంత్రులు సోమవారం పర్యటించనున్నారు. ఇందిరా సౌరగిరి జలవికాస పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు , ఎంపీలు, ఎమ్మెల్యేలు , ప్రజా ప్రతినిధులు గ్రామానికి వస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ను ప్రకటించారు.
రాష్ట్రంలోనే ప్రప్రథమంగా గిరిజనుల సంక్షేమానికి చేపట్టిన ఇందిరా సౌరగిరి జలవికాసం పథకాన్ని ప్రారంభించి , ఫొటో ఎగ్జిబిషన్ సందర్శన , మాచారంలో సీతా రామాంజనేయ ఆలయాన్ని దర్శించుకుంటారని వివరించారు. మాచారంలో జరిగే సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని , సభ పూర్తయిన అనంతరం సీఎం స్వగ్రామమైన వంగూరు మండలం కొండారెడ్డిపల్లి వెళ్తారని తెలిపారు.
అక్కడ నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగు పయనమవుతారని తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో సమన్వయంతో తమ విధులు నిర్వర్తిస్తూ ముఖ్యమంత్రి పర్యటన విజయవంతానికి కృషి చేస్తున్నారని వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

