Cold Weather | రాష్ట్రంపై చలిపంజా.. వచ్చే మూడ్రోజులు మరింత చలి
రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది. చలిగాలులకు జనం గజగజ వణుకుతున్నారు. నాలుగు రోజులుగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 15 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8గంటలు దాటినా మంచు, చలి తీవ్రతతో ప్రజలు ఇంట్లోంచి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు.
- సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు
- పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ
Cold Weather | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది. చలిగాలులకు జనం గజగజ వణుకుతున్నారు. నాలుగు రోజులుగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 15 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8గంటలు దాటినా మంచు, చలి తీవ్రతతో ప్రజలు ఇంట్లోంచి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో కనిష్ఠంగా 5.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)లో 6, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.1, ఖమ్మం జిల్లా తల్లాడలో 7.4, రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 7.9, నిర్మల్ జిల్లా పెంబిలో 8, కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 8.3, మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్‌లో 9.2, వికారాబాద్ జిల్లా కోట్‌పల్లిలో 9.3, మంచిర్యాల జిల్లా నెన్నెలలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
సూర్యాపేట జిల్లా మినహా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు అధికారులు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీచేశారు. నిరుటితో పోలిస్తే అన్ని జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పడిపోయినట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో చలితీవ్రత ఎక్కువగానే ఉంటుందని తెలిపారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలతోపాటు సంగారెడ్డి జిల్లాలో చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలుగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

