Siddaramaiah | కర్నాటక సీఎంను మార్చేందుకు కాంగ్రెస్ కసరత్తు : నాయకత్వ మార్పుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు
Siddaramaiah : కర్నాటక సీఎంను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. సీఎం రేసులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరు వినిపిస్తుండటంతో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
Siddaramaiah : కర్నాటక సీఎంను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. సీఎం రేసులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరు వినిపిస్తుండటంతో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. నాయకత్వ మార్పు విషయంపై కర్నాటక కాంగ్రెస్‌లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.
సిద్ధరామయ్యను పక్కకుపెట్టి డీకే శివకుమార్‌కు పాలనా పగ్గాలు అప్పగిస్తారని హైకమాండ్ సైతం ఈ దిశగా కసరత్తు సాగిస్తున్నదని కాంగ్రెస్ వర్గాల్లో హాట్ డిబేట్ సాగుతోంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల సమక్షంలో ఇటీవల ఓ స్వామీజీ డీకేను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఇక సీఎం మార్పు వార్తలపై సిద్ధరామయ్యను సోమవారం మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయం ప్రజల మధ్య చర్చించాల్సిన వ్యవహారం కాదని పేర్కొన్నారు. పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. సీఎం మార్పు వ్యవహారంపై సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు నాయకత్వ మార్పు ఊహాగానాలు మరింత జోరుగా సాగేలా చేశాయని భావిస్తున్నారు. సీఎంను మార్చుతారనే వ్యాఖ్యలను ఆయన ఖండించకపోవడంపై హాట్డిబేట్ సాగుతోంది. దీంతో సీఎం సిద్ధరామయ్యపై వేటు తప్పదా అని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జోరందుకుంది.
Read More :
Waterfall: లోనావాలా జలపాతంలో కొట్టుకుపోయిన ఏడు మంది.. వీడియో
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

