సీఎం కేసీఆర్ విద్యపై అత్యంత శ్రద్ధ..
ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్సియల్ పాఠశాలలు ప్రారంభించడం అభినందనీయం
జలశక్తి మంత్రిత్వశాఖ అడిషనల్ కార్యదర్శి అశోక్ కుమార్

నిజామాబాద్ సిటీ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు విద్యపై అత్యంత శ్రద్ధ చూపుతున్నారని జలశక్తి మంత్రిత్వశాఖ అడిషనల్ కార్యదర్శి అశోక్ కుమార్ అన్నారు. ఒకే రోజు రాష్ట్రమంత రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. శుక్రవారం ప్రగతిభవన్ సమావేశం మందిరంలో ఆజాదీకా అమృత్ మహోత్సవరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2001లో తాను జిల్లా కలెక్టర్‌గా పని చేసిన సమయంలో ప్రభుత్వ ప్రోత్సాహం, అధికారుల అంకితభావం, ప్రజాప్రతినిధుల సహకారంతో వేల్పూర్ మండలాన్ని దేశంలోనే మొదటిసారిగా బాల కార్మికులు లేని మండలంగా జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు.
మండలంలో 539 మంది బాలకార్మికులను పాఠశాలలో చేర్పించామని, దీనిని సాధించడానికి చాలా కృషి చేశామని, తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తుపై అవగాహన కల్పించడం వల్ల అంగీకరించారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు అశోక్‌కుమార్ చేసిన సేవలను జిల్లా ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కార్యదర్శి అశోక్‌కుమార్‌ను జిల్లా అధికారులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చిత్రమిశ్రా, శిక్షణ సహాయ కలెక్టర్ మకరంద్, అప్పటి సీపీవో షేక్మీరా, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

