పీలేను మించిన రొనాల్డో.. ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్

ట్యూరిన్: పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో.. సాకర్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా బ్రెజిల్ దిగ్గజ ఆటగాడు పీలే పేరు మీద ఉన్న రికార్డును తిరగరాశాడు. ఆదివారం జువెంటస్ క్లబ్ తరఫున హ్యాట్రిక్ గోల్స్ చేసిన రొనాల్డో.. ఈ అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఈ మూడు గోల్స్‌తో రొనాల్డో మొత్తం గోల్స్ సంఖ్య 770కి చేరింది. సిరీ ఎ లీగ్‌లో భాగంగా కాగ్లియారీ టీమ్‌తో ఆడిన జువెంటస్.. రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్‌తో 3-1తో గెలిచింది.
హ్యాట్రిక్‌తో రికార్డు
ఫుట్‌బాల్ చరిత్రలో ఇప్పటి వరకూ 767 గోల్స్‌తో పీలే పేరు మీద రికార్డు ఉంది. ఈ మ్యాచ్‌కు అతనితో సమానంగా ఉన్న రొనాల్డో.. హ్యాట్రిక్‌తో పీలేను అధిగమించాడు. తన దేశం పోర్చుగల్‌తోపాటు తాను వివిధ క్లబ్‌ల తరఫున చేసిన మొత్తం గోల్స్ అన్నీ కలిపితే 770. వీటిలో క్లబ్‌ల తరఫున చేసిన గోల్స్ 668 కాగా.. పోర్చుగల్ తరఫున 102 గోల్స్ చేశాడు. రియల్ మాడ్రిడ్ తరఫున 450, మాంచెస్టర్ యునైటెడ్ తరఫున 118, జువెంటస్ తరఫున 95, స్పోర్టింగ్ లిస్బన్ తరఫున 5 గోల్స్ చేశాడు. తన రికార్డును అధిగమించిన సందర్భంగా రొనాల్డోపై ప్రశంసల జల్లు కురిపించాడు పీలే. ఇటు రొనాల్డో కూడా ఈ అరుదైన ఫీట్‌పై తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ సుదీర్ఘ పోస్ట్ చేశాడు. పీలే రికార్డును అధిగమిస్తానని తాను కలలో కూడా అనుకోలేదని ఈ సందర్భంగా రొనాల్డో అన్నాడు. అయితే రొనాల్డోదే రికార్డు అని అధికారిక రిపోర్టు చెబుతున్నా.. చెక్ రిపబ్లిక్ మాత్రం తమ ప్లేయర్ బికాన్ అధికారిక మ్యాచ్‌లలో అత్యధిక గోల్స్ (821) చేశాడని చెప్పుకుంటోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

