తెలంగాణలో చికున్ గున్యా విజృంభణ
తెలంగాణలో చికున్ గున్యా విజృంభిస్తున్నదని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. తెలంగాణ నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికుల్లో ఊహించిన సంఖ్య కంటే ఎక్కువగా బాధితులు ఉన్నారని తెలిపింది.
- 447 కేసులు నమోదయ్యాయన్న వైద్యారోగ్య శాఖ
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో చికున్ గున్యా విజృంభిస్తున్నదని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. తెలంగాణ నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికుల్లో ఊహించిన సంఖ్య కంటే ఎక్కువగా బాధితులు ఉన్నారని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ అమెరికా పర్యాటకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఉందని ఈ ఏడాది జూలైలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వ్యాధుల కట్టడికి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది.
డెంగీ, చికున్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ విజృంభించే అవకాశం ఉన్నదని చాలా అధ్యయనాలు హెచ్చరించాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణ, దోమల నివారణ వంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో దాదాపు 8 వేల డెంగీ కేసులు నమోదయ్యాయి. దవాఖానాల్లోనూ ప్రభుత్వం సరైన సదుపాయాలు కల్పించలేదు. మందుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా చికున్ గున్యాపై అమెరికా సీడీసీ వెల్లడించిన నివేదికతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. సీడీసీ రిపోర్ట్‌పై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పందించింది. ఈ ఏడాది 447 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఫీవర్స్ సీజన్లో చికున్ గున్యా కేసులపై గోప్యత పాటిస్తూ తప్పుడు లెక్కలు ప్రకటించిన సర్కారు అమెరికా నివేదికతో అంకెలు మార్చి చెబుతున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

