IPL 2023 | చితక్కొట్టిన చెన్నై బ్యాటర్లు .. ధోనీ సేన హ్యాట్రిక్ విక్టరీ
ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద పారింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు దంచి కొట్టారు. దాంతో, ధోనీ సేన ఈ సీజన్లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 49 పరుగుల తేడాతో గెలిచింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(56), అజింక్యా రహానే(71), శివం దూబే(50) వీర కొట్టుడు కొట్టడంతో చెన్నై 234 పరుగులు చేసింది. ఆ తర్వాత జేసన్ రాయ్(61), రింకూ సింగ్(53) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడినా సరిపోలేదు.
IPL 2023 : ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద పారింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు దంచి కొట్టారు. దాంతో, ధోనీ సేన ఈ సీజన్లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 49 పరుగుల తేడాతో గెలిచింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(56), అజింక్యా రహానే(71), శివం దూబే(50) వీర కొట్టుడు కొట్టడంతో చెన్నై 234 పరుగులు చేసింది. ఆ తర్వాత జేసన్ రాయ్(61), రింకూ సింగ్(53) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడినా సరిపోలేదు. కోల్‌కతాకు ఇది వరుసగా నాలుగో ఓటమి. భారీ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.
పథిరన వేసిన ఆఖరి ఓవర్లో 56 రన్స్ అవసరమయ్యాయి. తొలి బంతికి రింకూ సింగ్(53) సిక్స్ కొట్టి యాభై రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఫోర్ కొట్టాడు. లాంగాఫ్‌లో సిక్స్ బాదాడు. దాంతో చెన్నై 49 పరుగుల తేడాతో గెలుపొందింది.
భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతాకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది.. ఓపెనర్‌గా వచ్చిన సునీల్ నరైన్(0)ను ఇంపాక్ట్ ప్లేయర్ ఆకాశ్ సింగ్ బౌల్డ్ చేశాడు. రెండో ఓవర్లో మరో ఓపెనర్ జగదీశన్(1) ఔటయ్యాడు. కెప్టెన్ నితీశ్ రానా(27),ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(20) తక్కువకే ఔటయ్యారు. ఆ తర్వాత జేసన్ రాయ్(61), రింకూ సింగ్ ధాటిగా ఆడారు. రాయ్ ఔటయ్యాక ఆండ్రూ రస్సెల్(9), చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, మహీశ్ థీక్షణ రెండు వికెట్లు తీశారు. ఆకాశ్ సింగ్, జడేజా, మోయిన్ అలీ తలా ఒక వికెట్ తీశారు.
చితక్కొట్టిన చెన్నై బ్యాటర్లు
ఫామ్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చితక్కొట్టారు. ఓపెనర్ డెవాన్ కాన్వే(56), అజింక్యా రహానే(37), శివం దూబే(50) సిక్స్‌లు, ఫోర్లతో హోరెత్తించారు. దాంతో ధోనీ సేన ఈ సీజన్లో అత్యధిక పరుగులు కొట్టింది. కోల్‌కతాకు 236 టార్గెట్ నిర్దేశించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (35), డెవాన్ కాన్వే(56 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని సుయాశ్ శర్మ తన మొదటి ఓవర్లోనే విడదీశాడు. రుతురాజ్‌ను బౌల్డ్ చేశాడు. అయినా చెన్నై బ్యాటర్ల జోరు తగ్గలేదు. క్లాస్ ఆటతో అలరించిన అజింక్యా రహానే(71: 29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), శివం దూబే(50: 21 బంతుల్లో రెండు ఫోర్లు, 5 సిక్స్‌లు) సిక్సర్లతో విరుచుకుపడ్డారు. కోల్‌కతా స్పిన్ త్రయాన్ని ఉతికి ఆరేశారు. ఆఖర్లో రవీంద్ర జడేజా(18) దంచాడు. కోల్‌కతా బౌలర్లలో ఖేజ్రోలియా రెండు, వరుణ్ చక్రవర్తి, సుయాశ్ శర్మ తలా ఒక వికెట్తీశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
Krishnaraj | తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం ..ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

