Drugs Case: ఈడీ విచారణకు హాజరైన నటి ఛార్మి

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 12మంది సెలబ్రిటీలకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్(ఈడీ) ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను ఈడీ విచారించింది. దాదాపు 10 గంటలకు పైగా ఈడీ అధికారులు పూరీ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, మనీ ట్రాన్స్ఫర్ వంటి అంశాలపై ఈడీ లోతుగా విచారించినట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ రోజు నటి ఛార్మిని విచారించనున్నారు అధికారులు. ఇందులో భాగంగా కాసేపటి క్రితం ఛార్మి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఛార్మి తో పాటు విచారణకు ఆమె చార్టెడ్ అకౌంటెంట్ సతీష్ కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు ఆమెతో పాటు 15 మంది బౌన్సర్స్ ఈడీ కార్యాలయం దగ్గరకి చేరుకొని హంగామా సృష్టించినట్టు తెలుస్తుంది.
పూరీ జగన్నాథ్‌తో కలిసి పని చేస్తున్న ఛార్మీని ఈడీ అధికారులు డ్రగ్స్ కేసులో ప్రశ్నలు సంధించడంతో పాటు బ్యాంక్ లావాదేవీల వివరాలపై ఆరా తీయనున్నారు. ఇప్పటికే పూరీ జగన్నాథ్, ఛార్మి నిర్మాతలుగా కొన్ని సినిమాలు నిర్మించారు. దీంతో ఇద్దరి బ్యానర్లకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ అప్రూవర్‌గా మారడంతో పలువురు టాలీవుడ్ నటీనటుల పేర్లు బయటకి వచ్చాయి. కెల్విన్ అకౌంట్లో ఛార్మి డబ్బులు వేసిందా ? కెల్విన్‌తో ఆమెకు పరిచయం ఉందా ? ఛార్మీ కెల్విన్ అకౌంట్‌కు మనీ ట్రాన్స్ఫర్ చేసింది నిజమేనా ? అన్న కోణంలోనూ ఈడీ విచారించనున్నట్లుగా తెలుస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

