హాస్టల్ వార్డెన్ సస్పెండ్.. 24 వరకు చండీగఢ్ వర్సిటీ బంద్
Chandigarh University videos:పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్ వార్డెన్ రజ్విందర్ కౌర్‌ను సస్పెండ్ చేశారు. విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో కౌర్‌పై సస్పెండ్ చేశారు. గర్ల్స్ హాస్టల్‌కు చెందిన కొందరి అమ్మాయిల ప్రైవేటు వీడియోలు లీకైన కేసులో అధికారులు చర్యలు తీసుకున్నారు. వర్సిటీని శనివారం వరకు మూసి వే
చండీగఢ్: పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్ వార్డెన్ రజ్విందర్ కౌర్‌ను సస్పెండ్ చేశారు. విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో కౌర్‌ను సస్పెండ్ చేశారు. గర్ల్స్ హాస్టల్‌కు చెందిన కొందరి అమ్మాయిల ప్రైవేటు వీడియోలు లీకైన కేసులో అధికారులు చర్యలు తీసుకున్నారు. వర్సిటీని శనివారం వరకు మూసి వేస్తున్నట్లు అధికారులు చెప్పారు. దీంతో ఇవాళ తమ పిల్లల్ని తీసుకువెళ్లేందుకు విద్యార్థినుల పేరెంట్స్ వర్సిటీకి వచ్చారు. ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కు అభ్యంతరకరమైన కొన్ని వీడియోలను షేర్ చేసింది. ఆ వీడియోలను అతను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో వర్సిటీ గర్ల్స్ హాస్టల్లో ఆందోళన చెలరేగింది.
వీడియోలను రిలీజ్ చేసిన అమ్మాయిని అరెస్టు చేస్తున్న సమయంలో పోలీసుల్ని హాస్టల్ వార్డెన్ అడ్డుకున్నట్లు తెలిసింది. నిరసన చేసిన విద్యార్థినిలను కూడా ఆమె తిట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం నాలుగు వీడియోలను ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపించింది. వర్సిటీ వద్ద ఎటువంటి సూసైడ్ ప్రయత్నం జరగలేదని పోలీసు ఆఫీసర్ నవ్రీత్ సింగ్ విర్క్ తెలిపారు.
ఏం జరిగిందంటే..
క్యాంపస్‌లో విద్యార్థులు శనివారం రాత్రి పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. స్నానం చేస్తుండగా వీడియోలు తీసి, వాటిని హిమాచల్‌ప్రదేశ్‌లో ఉండే తన బాయ్‌ఫ్రెండ్‌కు ఓ అమ్మాయి పంపినట్టు ఆరోపణలు వెల్ల్లువెత్తాయి. వీటిని ఆ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్ సోషల్‌మీడియాలో అప్లోడ్ చేసినట్టు సమాచారం. అయితే, సదరు విద్యార్థిని తన సొంత వీడియోనే షేర్ చేసిందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఐపీసీ సెక్షన్ 354 సీ (వోయూరిజం), ఐటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విద్యార్థినిని, సిమ్లాలో ఉంటున్న ఆమె బాయ్ ఫ్రెండ్ అరెస్టు చేశామన్నారు.
ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ మనీషా గులాటీ ఘటన వివరాలను విద్యార్థినులను అడిగి తెలుసుకొన్నారు. వీడియోలను ఎవరెవరికి షేర్ చేశారు, ఎక్కడెక్కడ అప్లోడ్ చేశారన్న కోణంలో ఫోరెన్సిక్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

