నిరాశపరిచిన చావు కబురు చల్లగా.. గీతా ఆర్ట్స్ 2లో డిజాస్టర్

ఆర్ఎక్స్ 100 తర్వాత హిట్ లేని కార్తికేయ.. చావు కబురు చల్లగా సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా కచ్చితంగా తనకు మంచి విజయం అందిస్తుందని చాలా నమ్మాడు. కొత్త దర్శకుడు కౌశిక్ తెరకెక్కించిన చావు కబురు చల్లగా మార్చ్ 19న విడుదలైంది. కానీ ఈ సినిమాకు తొలిరోజే టాక్ తేడా వచ్చేసింది. దాంతో గీతా ఆర్ట్స్ 2 ఇమేజ్ కూడా సినిమాను కాపాడలేకపోయింది. మూడు రోజులకే ఫుల్ రన్ కంప్లీట్ అయిపోయింది ఈ సినిమాకు. 13 కోట్ల బిజినెస్ చేసిన చావు కబురు చల్లగా 3 కోట్ల దగ్గరే తన ప్రయాణం ముగించింది. దాంతో గీతా ఆర్ట్స్ 2లో తొలి డిజాస్టర్ గా నిలిచింది చావు కబురు చల్లగా. నిర్మాత బన్నీ వాసును ఈ సినిమా చావు దెబ్బ కొట్టేసింది. ఈ సినిమాకు ఏరియా వైజ్ గా వచ్చిన క్లోజింగ్ కలెక్షన్స్ ఏంటో చూద్దాం..
నైజాం- 1.19 కోట్లు
సీడెడ్- 0.55 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.36 కోట్లు
ఈస్ట్- 0.23 కోట్లు
వెస్ట్- 0.14 కోట్లు
గుంటూరు- 0.23 కోట్లు
కృష్ణా- 0.25 కోట్లు
నెల్లూరు- 0.13 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)- 3.08 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 0.09 కోట్లు
ఓవర్సీస్- 0.15 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 3.32 కోట్లు
గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన సినిమా కావడంతో కార్తికేయ మార్కెట్ ను కూడా పట్టించుకోకుండా ‘చావు కబురు చల్లగా’ సినిమాను 13.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్‌కు 13.7 కోట్ల వరకూ షేర్ రావాల్సింది. కానీ ఫుల్ రన్ లో కేవలం 3.32 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దాంతో 10 కోట్ల వరకు నష్టాలు తీసుకొచ్చింది చావు కబురు చల్లగా.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

