GST Compensation | రాష్ట్రాలకు రూ.40వేలకోట్ల జీఎస్టీ పరిహారం విడుదల
Centre releases ₹40,000 crore to states as GST compensation |

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గురువారం జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేసింది. జీఎస్టీ లోటును తీర్చేందుకు బ్యాక్ టూ బ్యాక్ రుణ సదుపాయం కింద రూ.40వేల కోట్లు పరిహారం విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి రెండు నెలలకోసారి విడుదల చేస్తున్న సాధారణ జీఎస్టీ పరిహారానికి ఇది అదనమని పేర్కొంది. ఐదు సంవత్సరాల సెక్యూరిటీతో కేంద్రం తీసుకున్న రుణం నుంచి ఈ నిధులను సమకూర్చింది. తాజాగా విడుదల చేసిన పరిహారంతో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇప్పటి వరకు రూ.1.15లక్షల కోట్లకు విడుదల చేసింది. మంత్రిత్వ శాఖ ఇంతకు ముందు జూలై 15న రాష్ట్రాలకు రూ.75వేలకోట్లు కేటాయించింది. 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్రం 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.1.59లక్షల కోట్లు అప్పు తీసుకొని రాష్ట్రాలకు పరిహారం కిందట అందజేస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

