జనగణనలో 40 ప్రశ్నలు.. జనవరి 10నుంచి 24 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్
జనగణన-2027కు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు సెన్సస్ ఆఫ్ ఇండియా కార్యాచరణ మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. దీనికి ప్రకారం వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 24 సెల్ఫ్ ఎన్యూమరేషన్, 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటా సర్వే నిర్వహించనున్నారు.
- 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటా సర్వే
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : జనగణన-2027కు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు సెన్సస్ ఆఫ్ ఇండియా కార్యాచరణ మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. దీనికి ప్రకారం వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 24 సెల్ఫ్ ఎన్యూమరేషన్, 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటా సర్వే నిర్వహించనున్నారు. మొత్తం 40 ప్రశ్నలతో జనగణన చేస్తారు. ఇందులో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు, వైవాహిక స్థితి, మతం, ఎస్సీ, ఎస్టీ, కుల వివరాలు, వైకల్యం, భాషలు, విద్య, అక్షరాస్యత, ఉపాధి, ఆర్థిక కార్యకలాపాలు, వలసలు తదితర సమాచారం సేకరిస్తారు. బ్యాంకు ఖాతాలు, మొబైల్ తదితర వివరాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి. సమాచారం ఇచ్చిన వారి సమాధానాల ఆధారంగానే వివరాలు పొందుపరచాలి. ఎన్యూమరేటర్లు తమ పరిధిలో క్షేత్రస్థాయిలో జనాభా లెకలు సేకరిస్తారు.
అలాగే ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలు నమోదు చేసే విధానంపై వారు చైతన్యపరచాల్సి ఉంటుంది. వివరాలు సరిపోకపోతే సాధారణ సర్వే నిర్వహించాలి. సేకరించిన వివరాలను మొబైల్ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు పాటించాల్సిన విధులు, బాధ్యతలను సెన్సస్ ఆఫ్ ఇండియా అప్పగించింది. అంతకుముందు నిర్వహించే శిక్షణకు హాజరై జనగణన యాప్, ప్రశ్నలు, సర్వే విధానాలపై అవగాహన పొందాలని సూచించింది. ప్రతి ఐదు నుంచి ఆరు ఇండ్ల సర్వే పూర్తయిన తర్వాత డేటాను సింక్రనైజ్ చేయాలి. తాళం వేసి ఉన్న ఇండ్లకు ఎన్యూమరేటర్ పేరు, ఫోన్ నంబరుతో స్టికర్ అంటించి తిరిగి సందర్శించాలి.
కొత్తగా నిర్మించిన భవనాలు, ఇండ్లు, కుటుంబాల వివరాలు నమోదు చేయాలి’ అని స్పష్టంచేశారు. అలాగే ఎన్యూమరేటర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూపర్వైజర్లకు మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. ఈ వివరాల నమోద ప్రక్రియంతా మార్చి 5లోగా పూర్తి చేయాలని మార్గదర్శకాల్లో వెల్లడించారు. ప్రధాన జనాభా గణన ఫిబ్రవరి 28తో పూర్తి కానున్నది. మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ రౌండ్ నిర్వహిస్తారు. ఈ సమయంలో జననాలు, మరణాలు, వలసలు, గతంలో నమోదు కాకుండా మిగిలిపోయిన వ్యక్తులు, ఇండ్ల వివరాలను సరిచూసి అవసరమైన సవరణలు చేయాల్సి ఉంటుంది. జనగణనలో సేకరించిన వ్యక్తిగత వివరాలను జనగణన చట్టం-1948 ప్రకారం గోప్యంగా ఉంచాలని మార్గదర్శకాల్లో నొక్కి చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

