న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిఫ్‌కార్ట్‌కు భారీ జరిమానా విధించారు. నాణ్యత లేని ప్రెజర్ కుక్కర్లను అమ్మిన కేసులో.. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఫ్లిప్‌కార్ట్‌కు జరిమానా వేసింది. పెనాల్టీ కింద లక్ష ఇవ్వాలని సీసీపీఏ ఆదేశించింది. క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం లేని సుమారు 598 ప్రెజర్ కుక్కర్లను వెనక్కి రప్పించాలని సీసీపీఏ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అంతే కాదు ఆ ప్రెజర్ కుక్కర్లను కొనుగోలు చేసిన వారందరికీ రీయంబర్స్మెంట్ ఇవ్వాలని పేర్కొన్నది.