వరదలో కొట్టుకుపోయిన బస్సు.. ఒకరు మృతి.. ముగ్గురు గల్లంతు
వరదలో కొట్టుకుపోయిన బస్సు.. ఒకరు మృతి.. ముగ్గురు గల్లంతు |

ముంబై : మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో వంతెనను దాటుతున్న సమయంలో ఆర్టీసీకి చెందిన బస్సు మంగళవారం కొట్టుకుపోయింది. ఈ ఘనటలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురి ఆచూకీ ఇంకా దొరకలేదు. ఉమర్‌ఖేడ్ తహసీల్‌లోని దహ్‌గావ్ వంతెన వద్ద ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన బస్సు నాగ్‌పూర్ నుంచి నాందేడ్ వెళ్తోంది. నీటితో నిండిన వంతెనను దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బస్సు సుమారు 50 మీటర్ల దూరం కొట్టుకువెళ్లి బోల్తాపడిందని అధికారులు పేర్కొన్నారు.
గతకొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉప్పొంగి వంతెనపైకి నీరు చేరింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో పాటు నలుగురు ప్రయాణికులు ఉన్నారని ఉమర్‌ఖేడ్ తహసీల్దార్ ఆనంద్ డియోల్గావ్ పేర్కొన్నారు. వరద ఉధృతికి బస్సు కొట్టుకుపోతున్న సమయంలో ఇద్దరు ప్రాణాలను కాపాడుకున్నారు. ఆ తర్వాత గల్లంతైన నలుగురిలో ఒకరిని రక్షించి, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. ముగ్గురికి కోసం గాలిస్తున్న ఆర్టీసీ అధికారులు, పోలీసులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

