బల్గేరియా ప్రధాని రాజీనామా!.. జెన్-జీ దెబ్బకు కూలిన మరో ప్రభుత్వం
జెన్-జీ దెబ్బకు మరో ప్రభుత్వం కూలిపోయింది. అవినీతికి వ్యతిరేకంగా యువత సాగించిన ఆందోళనలతో తన ప్రభుత్వం రాజీనామా చేస్తున్నట్లు బల్గేరియా ప్రధాని రాసెన్ జెలియాజ్‌కోవ్ గురువారం ప్రకటించారు.
- అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపిన యువత
న్యూఢిల్లీ: జెన్-జీ (Gen-G) దెబ్బకు మరో ప్రభుత్వం కూలిపోయింది. అవినీతికి వ్యతిరేకంగా యువత సాగించిన ఆందోళనలతో తన ప్రభుత్వం రాజీనామా చేస్తున్నట్లు బల్గేరియా (Bulgaria) ప్రధాని రాసెన్ జెలియాజ్‌కోవ్ (Rosen Zhelyazkov) గురువారం ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాకముందే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పార్లమెంట్లో ఓటింగ్‌కు రావడానికి ముందుగానే రాజీనామా చేస్తున్నట్లు బల్గేరియా ప్రధాని ప్రకటించారు.
రాసెన్ ప్రభుత్వ అవినీతిని నిరసిస్తూ వేలాదిమంది యువజనులు బుధవారం బల్గేరియా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వం రూపొందించిన 2026 ముసాయిదా బడ్జెట్‌పై మండిపడిన యువత ఇది అవినీతిని కప్పిపుచ్చేందుకు తయారుచేసిన బడ్జెట్‌గా అభివర్ణిస్తూ రోడ్లపైకి వచ్చింది. ప్రభుత్వం గతవారం ముసాయిదా బడ్జెట్‌ని ఉపసంహరించుకున్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చల్లారలేదు. అధికార పార్టీ నాయకులతో సమావేశమైన అనంతరం ప్రధాని జెలియాజ్‌కోవ్ ప్రభుత్వం నేడు రాజీనామా చేస్తున్నదని ప్రకటించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

