కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ అభిమానుల పాదయాత్ర.. ఎర్రవల్లికి బయలుదేరిన యువ నాయకులు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై అభిమానంతో ఆయన మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ సంగారెడ్డి జిల్లా హత్నూర మండలానికి చెందిన ఇద్దరు బీఆర్ఎస్ యువ నాయకులు పాదయాత్ర చేపట్టారు.
హత్నూర, నవంబర్ 8: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై అభిమానంతో ఆయన మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ సంగారెడ్డి జిల్లా హత్నూర మండలానికి చెందిన ఇద్దరు బీఆర్ఎస్ యువ నాయకులు పాదయాత్ర చేపట్టారు. మాధుర గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్, నర్సింలు శనివారం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పాదయాత్రగా బయలుదేరారు.
దౌల్తాబాద్‌లోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వారు పాదయాత్ర ప్రారంభించారు. మార్గమధ్యంలో చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయం, నాచారం నరసింహస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్, నర్సింలు మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి కేసీఆర్ మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి అవగాహన లోపంతో రాష్ట్రం దుర్భర పరిస్థితికి చేరిందని వారు ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్యుత్ కష్టాలు కనిపిస్తున్నాయని, రైతులను పలకరిస్తే వారి కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వాటిలో ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేని స్థితిలో ఉందని విమర్శించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర చేపట్టినట్లు వారు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామ్చంద్రారెడ్డి, మాధుర సర్పంచ్ నవీన్ గౌడ్, యువజన విభాగం మాజీ మండల అధ్యక్షుడు ఎల్చాల మధు, నాయకులు కృష్ణ యాదవ్, ఇబ్రహీం, రాము తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ అభిమానుల పాదయాత్ర.. ఎర్రవల్లికి బయలుదేరిన యువ నాయకులు
Telugu Cinema | హింసే పరమావధిగా టాలీవుడ్ సినిమాలు.. వెనకబడుతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ!
Vivek Oberoi | రియల్ హీరో అనిపించుకున్న వివేక్ ఒబెరాయ్.. రెమ్యునరేషన్ రూ.6 కోట్లు క్యాన్సర్ బాధిత చిన్నారులకు విరాళం!
Abhishek Banerjee: బీజేపీ గూండాలు ఇంటిపై దాడి చేశారు.. వీడియో షేర్ చేసిన టీఎంసీ ఎంపీ అభిషేక్
Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్‌కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్‌రాజు?
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

