ప్రతి గింజనూ కొనాలి
రైతులు పండించిన ప్రతి మొక్కజొన్న గింజనూ ప్రభుత్వం కొనాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు.
- బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్
- ధారూరు మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సందర్శన
ధారూరు, మే 11 : రైతులు పండించిన ప్రతి మొక్కజొన్న గింజనూ ప్రభుత్వం కొనాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు. మండలంలోని గట్టేపల్లిలో వారం రోజుల కిందట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా ఇప్పటికీ రైతుల నుంచి ఒక గింజనూ కొనలేదని, ప్రశ్నిస్తే హమాలీలు లేరని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఆయన వికారాబాద్ అదనపు కలెక్టర్‌కు ఫోన్ చేసి త్వరగా మొక్కజొన్న, వడ్లను కొనాలని సూచించారు.
గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గ్రామంలోనూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అన్నదాతకు మద్దతు ధర కల్పించగా..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో మొక్కజొన్న, ధాన్యాన్ని కొనాలని రైతులు రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు. అన్నదాతలు పంటను నిల్వచేసే వసతి లేక తక్కువ ధరకే మధ్యదళారులను విక్రయించి నష్టపోతున్నారని.. వారికి పంట సాగుకు అయిన అప్పులు కూడా రాలేని పరిస్థితి నెలకొన్నదన్నారు. ఆయన వెంట పార్టీ మండల నాయకులు వేణుగోపాల్ రెడ్డి, రాములు, అంజయ్య, జైపాల్‌రెడ్డి, దేవేందర్‌నాయక్, వెంకటయ్య, లక్ష్మయ్య, హాఫిజ్, మహేశ్‌కుమార్, రహ్మతుల్లాఖాన్ ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OPPO Smart Phone | ఒప్పో నుంచి బ్యాటరీ బాంబ్.. ఏకంగా 12,000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్!
Supreme Court: 3 రాష్ట్రాల మధ్య 60 ఏళ్లుగా విద్యుత్తు వివాదం.. పరిష్కరించిన సుప్రీంకోర్టు
Mahesh Babu | ‘రామాయణ’పై మహేష్ బాబు ప్రశంసలు.. ‘వారణాసి’లో శ్రీరాముడిగా ఎలా కనిపిస్తారోనని చర్చ..!
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

