పుష్పగుచ్ఛాలిచ్చి.. విషెస్ చెప్పి..
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం తాండూరు నియోజకవర్గంలో..అలాగే, హైదరాబాద్ మణికొండలోని రోహిత్‌రెడ్డి నివాసంలో వేడుకలు ఘనంగా జరిగియి. నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రోహితన్న యువసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
- ఘనంగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి జన్మదిన వేడుకలు
- పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు
తాండూరు, జూన్ 7: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం తాండూరు నియోజకవర్గంలో..అలాగే, హైదరాబాద్ మణికొండలోని రోహిత్‌రెడ్డి నివాసంలో వేడుకలు ఘనంగా జరిగియి. నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రోహితన్న యువసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అభిమానుల కోలాహలం మధ్య రోహిత్‌రెడ్డి తన సతీమణి ఆర్తిరెడ్డి, ఆయన తండ్రి సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు విఠల్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి తల్లి ప్రమోదినిరెడ్డి, సోదరుడు రితేశ్‌రెడ్డి, పార్టీ తాండూరు నియోజకవర్గ ఇన్చార్జి శ్రీశైల్‌రెడ్డి తదితరులతో కలిసి కేక్‌కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు.
అలాగే, రోహిత్‌రెడ్డి తాండూరు క్యాంపు కార్యాలయంలోనూ ఆయన తండ్రి విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలను నిర్వహించి కేక్ కట్ చేయగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా తాండూరు జిల్లా దవాఖానలో రోగులకు రోహితన్న సేన కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. కాగా, హైదరాబాద్ మణికొండలో నిర్వహించిన రోహిత్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలకు తాండూరు నియోజకరవర్గంలోని తాం డూరు, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, కోట్‌పల్లి మండలాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, నాయకులు తరలివెల్లారు.
రోహిత్‌రెడ్డి సతీమణి ఆర్తిరెడ్డితో కలిపి గజమాలను వేసి సత్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు కలిసి పుష్పగుచ్ఛాలు అందించి రోహిత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ తాం డూరు నియోజకవర్గ నాయకుడు రాజూగౌడ్ , ఇతర నాయకులు మాట్లాడుతూ.. ప్రజాసమస్యల పరిష్కారంతోపాటు తాండూరు అభివృద్ధికి కృషి చేసిన రోహిత్‌రెడ్డి ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

