ఢిల్లీ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.. బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ ధ్వజం
ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ తెలిపారు.
- కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆప్ సర్కారును కూల్చాయి
- ఆ కుట్రలో భాగంగానే కవితను అరెస్టు చేశారు
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి రాజకీయ కుట్రలు చేశాయని, అందులో భాగంగానే జాగృతి నేత కవితను అక్రమంగా అరెస్టు చేసి, బీఆర్ఎస్ను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కల్పిత లిక్కర్ స్కామ్ పేరుతో దుష్ప్రచారం చేసి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్ నాయకత్వంలో కొనసాగుతున్న ప్రభుత్వాన్ని కూలదోశారని ఆరోపించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి దుష్ప్రచారం చేయడం ద్వారా బీఆర్ఎస్ కొంతమేరకు నష్టాన్ని చూడాల్సి వచ్చిందని తెలిపారు.
ప్రతి కేసు కూడా రాజకీయ ప్రేరేపితం, కల్పితం అన్న విషయం త్వరలోనే బహిర్గతమవుతుందని చెప్పారు. నిజానిజాలు వెలుగులోకి వచ్చేంతవరకు బీజేపీ, కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు టీవీ సీరియల్లాగా కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. కొన్ని మీడియా వర్గాలు, సంస్థలు విచారణకు ముందే తీర్పు ఇచ్చేస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

