BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
BRS AUSTRALIA | తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ అనే తప్పుడు కథనాన్ని ప్రచురించడాన్ని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఇన్చార్జి అనిల్ బిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతులకు ఎంతో కీలకమైన సాగునీటి ప్రాజెక్టులపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆయన అన్నారు.
BRS AUSTRALIA : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ అనే తప్పుడు కథనాన్ని ప్రచురించడాన్ని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఇన్చార్జి అనిల్ బిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతులకు ఎంతో కీలకమైన సాగునీటి ప్రాజెక్టులపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆయన అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వార్తలను ప్రచురించకుండా పత్రికలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అదేవిధంగా తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక ముందు వారు కొన్ని డిమాండ్లు ఉంచారు. ఆ డిమాండ్లు ఏమిటంటే..
1. తెలంగాణ రైతుల జీవనాడి అయిన సాగునీటి ప్రాజెక్టులపై ఇలాంటి తప్పుడు ప్రాపగాండాను సహించేది లేదు.
2. ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ అనే పచ్చి అబద్ధపు కథనాన్ని 24 గంటల్లో ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
3. ఆ క్షమాపణను మొదటి పేజీలో తగిన ప్రాధాన్యంతో ప్రచురించడంతోపాటు, డిజిటల్ వేదికలు, అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోనూ వెల్లడించాలి.
కాగా, బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇప్పటికే వెలుగు యాజమాన్యానికి, ఎడిటర్‌కు లీగల్ నోటీసులు జారీచేసింది. 24 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తామని, అంతేగాక వర్తించే అన్ని చట్టాల ప్రకారం కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేసీఆర్‌ను తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న ఈ కుట్రపూరిత దుష్ప్రచారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలం అందరం ఐక్యంగా తిప్పికొడతామన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

