నిఖత్‌కు కాంస్యం
న్యూఢిల్లీ: టర్కీ వేదికగా జరుగుతున్న బోస్పోరస్ బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ పోరాటం ముగిసింది. గత రెండు బౌట్లలో ప్రపంచ చాంపియన్లను మట్టికరిపించిన నిఖత్‌కు సెమీస్‌లో చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన మహిళల 51కిలోల సెమీస్‌లో నిఖత్ 0-5 తేడాతో టర్కీ ఫేవరెట్ బుసెనాజ్ చేతిలో ఓటమిపాలై కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. 2019 ప్రపంచ చాంపియన్ అయిన బుసెనాజ్.. నిఖత్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కరోనా వైరస్ విజృంభణ తర్వాత తొలిసారి బాక్సింగ్ టోర్నీ బరిలోకి దిగిన జరీన్.. తొలుత అద్భుత విజయాలతో ఆకట్టుకుంది. గత జనవరి నుంచి ఢిల్లీలో శిక్షణ తీసుకున్న ఈ ఇందూరు బాక్సర్ అంచనాలకు అనుగుణంగా రాణించింది. మరోవైపు సోనియా లాథర్ (57కి), పర్వీన్ (60కి), జ్యోతి (69కి), శివథాపా (63కి) ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

