ప్రపంచ మేటి నగరం హైదరాబాద్

- కేసీఆర్, కేటీఆర్ కృషితో గ్లోబల్ సిటీగా అవతరణ
- ప్రపంచ కంపెనీలకు బెస్ట్ డెస్టినేషన్
- హైదరాబాద్‌పై బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూఫ్లెమింగ్ ప్రశంస
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): విభిన్న వర్గాలు, మతాలు, సంప్రదాయాలు, సంస్కృతులు ఉన్న ఒక నగరం ఒకవైపు వందల ఏండ్లనుంచి వస్తున్న సంప్రదాయాలను కాపాడుకొంటూనే.. మరోవైపు ఆధునిక హంగులతో అలరారితే ఎలా ఉంటుంది? మన హైదరాబాద్‌లా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బ్రిటిష్ డిఫ్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ఇదే మాట అంటున్నారు. ఉద్యోగ రీత్యా ప్రపంచవ్యాప్తంగా 115 దేశాలు, 1,200 నగరాల్లో పర్యటించిన ఆయన, వాటన్నింటిలో హైదరాబాద్ నగరమే అన్నిరకాలుగా అత్యుత్తమం అని చెప్తున్నారు. ‘హైదరాబాద్ ఈజ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్’ అని కితాబిచ్చారు. ఆండ్రూ ఫ్లెమింగ్‌తో ‘నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ’
హైదరాబాద్‌ను ఎలా వర్ణిస్తారు?
చారిత్రక, ఆధునికతల కలబోత హైదరాబాద్. లక్షల జనాభాతో నగరం ఎప్పుడూ సంతోష వాతావరణంలో మెరిసిపోతుంటుంది. పేద, ధనిక, కులాలు, మతాల భేదాలు లేకుండా అందరూ మనశ్శాంతితో జీవించే సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి.
గ్లోబల్ సిటీగా హైదరాబాద్‌కు
ఎన్ని మార్కులు వేస్తారు?
నా సొంత అభిప్రాయం ప్రకారం గ్లోబల్ సిటీగా హైదరాబాద్‌కు 7వ ర్యాంకు ఇస్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌కు వరుస కడుతున్నాయి.
హైదరాబాద్‌లో శాంతి భద్రతలపై మీ అనుభవం?
నేను తిరిగిన 115 దేశాలు, 1,200 పట్టణాల్లో ది బెస్ట్ సిటీగా హైదరాబాద్ నచ్చింది. ఇక్కడి ప్రభుత్వం, పోలీసులు ప్రజల భద్రత కోసం తీసుకొంటున్న చర్యలతో నగరం చాలా ప్రశాంతంగా ఉంటున్నది. ముఖ్యంగా మహిళల భద్రతకు రూపొందించిన షీ టీమ్స్ చాలా గ్రేట్. ఇంత పెద్ద నగరంలో ప్రశాంతతను నెలకొల్పడం నిజంగా ప్రశంసనీయం. షీ టీమ్స్‌తో కలిసి మేము బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రచారం నిర్వహిస్తున్నాం. నగరంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలతో భద్రత మరింత పెరిగింది.
ప్రపంచాన్ని హైదరాబాద్ వైపు ఆకర్షించేలా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేపట్టిన సంస్కరణలపై మీ అభిప్రాయం?
అనతి కాలంలోనే ప్రపంచాన్ని తెలంగాణ వైపు చూసేలా చేసి హైదరాబాద్‌కు దిగ్గజ కంపెనీలు క్యూ కట్టేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుంది. విదేశీ కంపెనీలకు సింగిల్ విండో ద్వారా అన్ని సదుపాయాలు వెనువెంటనే కల్పిస్తుండటంతో వ్యాపార ఔత్సాహికులు ఉత్సాహంతో ఇక్కడికి వస్తున్నారు. రాష్ట్ర ప్రతిష్ఠతోపాటు ఇక్కడి యువతకు, విద్యావంతులకు ఉద్యోగాలు కల్పించాలనే బాధ్యతతో ప్రభుత్వం ఒక సుస్థిరమైన వేదికను ఏర్పాటుచేసింది. దీని ద్వారా పూర్తి భద్రత కల్పిస్తుండటంతో హైదరాబాద్ వరల్డ్ సిటీగా మారిపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్టును చూసి జేమ్స్‌బాండ్ సినిమాలోని దృశ్యాలను ఎందుకు గుర్తుచేసుకొన్నారు?
కాళేశ్వరం నిజంగా ఓ అద్భుతం. అందులోని సొరంగం, మెషినరీ, భారీ లిఫ్టులు, భద్రత ఏర్పాట్లు.. నిజంగానే ఇది ప్రపంచంలో గొప్ప వింతగా అనిపించింది. ఇంత భారీప్రాజెక్టును నా కండ్లారా చూడటం అదృష్టంగా భావిస్తున్నా. అచ్చంగా జేమ్స్‌బాండ్ 007 సినిమాల్లోని భారీ దృశ్యాలు నాకు ప్రత్యక్షంగా ఇక్కడ కనిపించాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

