కిటెక్స్ను తేవడం గొప్ప విషయం

- కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశంసలు
హైదరాబాద్, అక్టోబర్1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి శుక్రవారం శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కిటెక్స్ వంటి దిగ్గజ వస్త్ర పరిశ్రమను రాష్ర్టానికి తీసుకొనిరావడం గొప్ప విషయమని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి పనిచేశారని మెచ్చుకొన్నారు. పరిశ్రమలు, ఐటీరంగంపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలు, ఐటీరంగంలో సాధించిన వృద్ధిపై భిన్నాభిప్రాయాలు లేవని స్పష్టంచేశారు. ఉద్యోగాలు, ఐటీ ఎగుమతులు, పరిశ్రమల ఏర్పాటు విషయంలో ప్రభుత్వ గణాంకాలతో ఏకీభవించారు. ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. పరిశ్రమల్లో తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ప్రత్యేక విధానం అనుసరిస్తున్నామని, ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యమిచ్చే కంపెనీలకు రాయితీలు, ప్రోత్సహకాలు అందిస్తున్నట్టు వివరించారు. కంపెనీలకు, స్థానికయువతకు ఉపయోగపడేలా చర్యలు తీసుకొంటున్నట్టు పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

