Bridge Accident | ఎందుకు రద్దు చేయకూడదు? మోర్బీ మున్సిపాలిటీకి ప్రభుత్వం నోటీసులు..!
Bridge Accident | గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటనపై ప్రభుత్వం స్థానిక మున్సిపాలిటీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మున్సిపల్ విధులను నిర్వర్తించడంలో విఫలమైనందున ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటీసుల్లో ఆదేశించింది.
గాంధీనగర్ : గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటనపై ప్రభుత్వం స్థానిక మున్సిపాలిటీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మున్సిపల్ విధులను నిర్వర్తించడంలో విఫలమైనందున ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటీసుల్లో ఆదేశించింది. గతేడాది అక్టోబర్ 30న మోర్బీలో మచ్చు నదిపై బ్రిటీష్ కాలం నాటికి చెందిన తీగల వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో 47 మంది పిల్లలతో సహా దాదాపు 140 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే. ఈ క్రమంలో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ తాజాగా నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 25వ తేదీలోగా సాధారణ సభ తీర్మానం రూపంలో లిఖితపూర్వక వివరణను సమర్పించాలని మోర్బీ మున్సిపాలిటీని నోటీసుల్లో ఆదేశించింది. ఇంతకు ముందు హైకోర్టులో వాదనలు జరిగిన సమయంలో.. ప్రమాదం తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం మున్సిపాలిటీని రద్దు చేయాలని నిర్ణయించింది. మోరీ వంతెన ఘటనను దృష్టిలో ఉంచుకొని హైకోర్టు రాష్ట్రం మొత్తంలో వంతెనలపై సర్వే నిర్వహించాలని భూపేంద్ర పటేల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్ని సక్రమంగా ఉన్నాయో నివేదికను కోర్టు ముందుంచాలని ఆదేశించింది. ఇదే సమయంలో మృతులు, క్షతగాత్రుల కుటుంబానికి ఇచ్చే పరిహారం పెంచాలని హైకోర్టు సూచించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

