పెండ్లి తర్వాత కొన్ని గంటలకే గుండెపోటుతో వధువు మృతి..!

బెంగళూరు: కర్ణాటకలో ఒక విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. పెండ్లి సందడితో కళకళలాడిన ఓ ఇంట్లో కొన్ని గంటల్లోనే రోదనలు మిన్నంటాయి. అప్పటిదాకా కేరింతలతో అలరారిన ఆ ఇల్లు కాసేపటికే ఏడుపులు, పెడబొబ్బలతో మారుమోగింది. బంధుమిత్రుల మధ్య వరుడితో ఆనందంగా తాళి కట్టించుకున్న వధువు పెండ్లి బట్టల్లోనే కుప్పకూలి కన్నుమూసింది. కర్ణాటకలోని అడ్యార్ పట్టణలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం (ఫిబ్రవరి 28) మధ్యాహ్నం తర్వాత అడ్యార్ మసీదులో లైలా అఫియా అనే 23 ఏండ్ల యువతికి, ముబారక్ అనే యువకుడికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. లైలాతోపాటు ఆమె సోదరుడి వివాహం కూడా అదే వేదికపై, అదే సమయంలో వివాహం చేసుకున్నాడు. లైలా తండ్రి అబ్దుల్ కరీం బీరప్పగద్దె జమాత్ అధ్యక్షుడు కావడమేక, ఆయన పిల్లలిద్దరి పెండ్లిళ్లు ఒకే మంటపంలో జరుగుతుండటంతో బంధుమిత్రులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
దాంతో వివాహం ఘనంగా జరిగింది. అతిథులందరూ వధూవరులను ఆశీర్వదించి వెళ్లారు. అదేరోజు సాయంత్రం వధూవరులు, వారి కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు వధువు లైలా ఇంటికి వెళ్లారు. రాత్రంతా వధూవరులతో కలిసి ఇరుకుటుంబాల వాళ్లు సందడి చేశారు. ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేశారు. అయితే అందరితో కలిసి సందడి చేస్తూ అర్ధరాత్రి తర్వాత పెండ్లి కుమార్తె లైలా ఛాతిలో నొప్పిగా ఉందంటూ ఒక్కసారిగా కుప్పకూలింది.
దాంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బీరప్పగద్దె మసీదు సమీపంలో ఆమెను ఖననం చేశారు. లైలా మృతికి గుండెపోటే కారణమని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. కాగా, పెండ్లి జరిగిన కొన్ని గంటల్లోనే వధువు మరణించడంతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Adyar
- Bride died
- karnataka
- Marriage
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

