తల్లిపాలతో ముందుగానే బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ
ల్లి పాలపై విశ్లేషణల (ద్రవ బయాప్సీ) ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చని స్పెయిన్ పరిశోధకులు వెల్లడించారు. రొమ్ము క్యాన్సర్‌కు కారకమయ్యే ట్యూమర్ డీఎన్ఏ రొమ్ము క్యాన్సర్ ఉన్న తల్లుల పాలల్లోనూ ఉన్నట్టు పరిశోధకులు చెప్పారు.
మాడ్రిడ్: తల్లి పాలపై విశ్లేషణల (ద్రవ బయాప్సీ) ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చని స్పెయిన్ పరిశోధకులు వెల్లడించారు. రొమ్ము క్యాన్సర్‌కు కారకమయ్యే ట్యూమర్ డీఎన్ఏ రొమ్ము క్యాన్సర్ ఉన్న తల్లుల పాలల్లోనూ ఉన్నట్టు పరిశోధకులు చెప్పారు. స్పెయిన్‌లోని వాల్ డీ హెబ్రాన్ యూనివర్సిటీ బ్రెస్ట్ క్యాన్సర్ గ్రూప్ హెడ్ డా.క్రిస్టినా సౌరా నేతృత్వంలో ఈ పరిశోధనలు నిర్వహించారు. సాధారణంగా రొమ్ము క్యాన్సర్ రోగుల్లో ట్యూమర్ డీఎన్ఏ ఉంటుంది. యూనివర్సిటీకి చెందిన దవాఖానలో రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ గర్భిణి చేరారు.
తన పాల ద్వారా బిడ్డకు కూడా క్యాన్సర్ సోకుతుందేమోనని ఆమె భయపడ్డారు. ఏడాది క్రితం శీతలీకరణం చేసిన పాలను ఆమె పరిశోధకులకు అందించగా.. ఆ పాలపై పరిశోధనలు చేసి అందులో ట్యూమర్ డీఎన్ఏ ఉన్నట్టు గుర్తించారు. అనంతరం 15 మంది తల్లుల నుంచి పాల శాంపిళ్లను సేకరించి.. నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సీంగ్ (ఎన్జీఎస్), డ్రాప్లెట్ డిజిటల్ పీసీఆర్ టెక్నాలజీతో పరీక్షించగా అందులో 13 మంది తల్లుల పాలల్లో ట్యూమర్ డీఎన్ఏ ఉన్నట్టు నిర్ధారించారు. పరిశోధకులు వీహెచ్ఐవో-వైడబ్ల్యూబీసీ జెన్ ప్యానెల్‌ను రూపొందించారు. అయితే ఈ పాల వల్ల పిల్లలకు ఎటువంటి ప్రమాదం ఉండదని డా.క్రిస్టినా సౌరా తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

