బ్రెజిల్లో ఒక్కరోజే 3 వేలకుపైగా కరోనా మరణాలు..!

బ్రసీలియా: బ్రెజిల్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. అక్కడ ఒక్కరోజే మూడు వేలకుపైగా కరోనా మరణాలు సంభవించాయి. కరోనా మొదటి దశలో తీవ్రంగా ప్రభావితమైన బ్రెజిల్.. రెండో దశలోనూ భారీగా కొత్త కేసులు, వేలల్లో మరణాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. అక్కడ మంగళవారం ఒక్కరోజే 3,251 మరణాలు సంభవించాయి. దాంతో బ్రెజిల్ ఇప్పటివరకు నమోదైన కరోనా చావుల సంఖ్య 2.99 లక్షలకు చేరువయ్యింది.
బ్రెజిల్ ఆరోగ్యశాఖ ఈ వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు ఏ దేశంలోనూ ఈ స్థాయిలో కరోనా మరణాలు చోటుచేసుకోలేదని బ్రెజిల్ ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తంచేసింది. మంగళవారం నాటి కరోనా మరణాల్లో ఒక్క సావోపా నగరంలోనే 1021 మరణాలు సంభవించాయని తెలిపింది. కాగా, కరోనా మరణాల్లో అమెరికా తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నది. కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుండటంతో బ్రెజిల్ ఆస్పత్రుల్లో రోగులకు ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు సరిపోవడం లేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
‘రామవరం ప్రజలకు స్థిరాస్తి పేరు మార్పిడికి అవకాశం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

