హైదరాబాద్ : కారును లారీ ఢీ కొట్టిన(Lorry collided) ఘటనలో ఓ బాలుడు మృతి(Boy killed) చెందాడు. ఈ విషాదకరస సంఘటన మేడ్చల్ అవుటర్ రింగ్ రోడ్డుపై(Medchal ORR) చోటు చేసుకుంది. కారులో వెళుతుం డగా పూజిత్రామ్(16)కు వాంతులు అవుతుండటంతో బాలుడి తండ్రి కారును పక్కకు ఆపాడు. ఇదే క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ కారును ఢీ కొట్టడంతో పూజిత్ రామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.