తల్లి టీవీ ఆఫ్ చేసిందని ఉరేసుకొని బాలుడి ఆత్మహత్య
బాలుడి ఆత్మహత్య | తల్లి టీవీ ఆఫ్ చేసిందన్న కోపంతో కుమారుడు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా కేజ్ తాహసిల్ పరిధిలోని వకిల్‌వాడి ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ విషాద ఘటన జరిగింది.

ముంబై : తల్లి టీవీ ఆఫ్ చేసిందన్న కోపంతో కుమారుడు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా కేజ్ తాహసిల్ పరిధిలోని వకిల్‌వాడి ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ విషాద ఘటన జరిగింది.
వకిల్‌వాడి ప్రాంతానికి చెందిన బాలుడు (19) స్థానికంగా ఓ పాఠశాలలో చదువుతున్నాడు. ఆన్లైన్ క్లాసులు ముగియగానే ఇంట్లో నేలపై పడుకొని టీవీ చూస్తున్నాడు.
సరిగ్గా కూర్చొని టీవీ చూడాలంటూ తల్లి టీవీని ఆఫ్ చేసింది. దీంతో తీవ్ర మనోవేదనకు లోనైన బాలుడు స్నానాల గదిలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాసేపటి తల్లి, సోదరి విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | కోడిగుడ్లు అతిగా తింటే డయాబెటిస్ వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..!
AP News | ఏపీలో మిగిలిన 23 లోకల్ బాడీ ఎన్నికలకు రేపే షెడ్యూల్ విడుదల..!
Menopause | రుతువిరతి అంటే ఏమిటి.. మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం చేయాలి..?
Pak’s Toxic Fairness Cream | నిషేధం ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పాక్ విషపూరిత క్రీమ్ అమ్మకాలు
గురుకుల విద్యార్థులపై వసతి గృహా విద్యార్థుల దాడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

