బోనీ కపూర్ క్రెడిట్ కార్డు నుంచి 3.82 లక్షల చోరీ
ముంబై: ఫిల్మ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ క్రెడిట్ కార్డు నుంచి సుమారు 4 లక్షల చోరీ జరిగింది. ఫిబ్రవరి 9వ తేదీన తన అకౌంట్ నుంచి 3.82 లక్షలు ట్రాన్స్ఫర్ అయినట్లు బోనీ కపూర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయిదు సార్లు ఆ లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. ముంబైలోని అంబోలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద ఈ కేసును ఫైల్ చేశారు. తన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బలు విత్‌డ్రా అయినట్లు తెలుసుకున్న బోనీ కపూర్ దీని గురించి బ్యాంక్ వద్ద సమాచారం కోరారు. ఆ తర్వాత ఆయన పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. తనను ఎవరూ క్రెడిట్ కార్డు వివరాలు అడగలేదని, కనీసం ఫోన్ కాల్ కూడా రాలేదన్నారు. బోనీ కపూర్ క్రెడిట్ కార్డు వాడుతున్న సమయంలో సైబర్ నేరగాళ్లు డేటాను చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బోనీ అకౌంట్ల ఉన్న డబ్బు గురుగ్రామ్‌లోని ఓ కంపెనీ అకౌంట్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

