Telangana bonalu festival | తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బోనాలు:మంత్రి సబితాఇంద్రారెడ్డి

మహేశ్వరం: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీక మన బోనాల పండుగ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాలలోని సూర్యగిరి ఎల్లమ్మతల్లిని దేవస్థాన చైర్మన్ రెడ్డిగళ్లరత్నంతో కలిసి మంత్రి దర్శించుకున్నారు. దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన సూర్యగిరిఎల్లమ్మ తల్లి చలువతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. భక్తుల కొంగుబంగారం గా పిలువబడే ఎల్లమ్మతల్లి కళ్యాణోత్సవంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ బోనాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు.గత ఏడాది కరోన కారణంగా బోనాల పండుగను జరుపుకోలేక పోయామని ఆమె అన్నారు. ఈఏడాడి పెద్ద ఎత్తున పండుగలను జరుపుకునే విదంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసిందని అన్నారు.
కరోనా నుండి తెలంగాణ ప్రజలను విముక్తి కల్గించాలని ఆమె ప్రార్ధించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లను చేసిన ఆలయకమిటి సిబ్బందిని, ఇతర అధికారులను మంత్రి అభినందించారు.అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థాన కమిటీ సిబ్బంది ఇతర అధికారులు మంత్రికి పూర్ణకుంభంతో అఖండ స్వాగతం పలికారు. ఈకార్యకమంలో మున్సిపల్ చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానివెంకట్రెడ్డి కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

