ఒక్కో చీరది ఒక్కో అందం. పట్టు, ఫ్యాన్సీ శుభకార్యాలూ వేడుకల్లో తళుక్కుమంటాయి. సాదా చీరలు రోజువారీ పనులకు సౌకర్యంగా ఉంటాయి. ఆ రెండిటి కలగలపుగా.. సాదా చీరకు ప్రింటెడ్ బ్లౌజ్‌తోపాటు జార్జెట్ సొగసులద్దిన డిజైన్లు..
ఇక్కత్ జతగా..
బ్లాక్ అండ్ వైట్.. ఎవర్గ్రీన్ కాంబినేషన్. నల్లరంగు జార్జెట్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన చీరకు.. అదే రంగు కలయికతో గడుల ఇక్కత్ బ్లౌజ్ జతచేశారు. ఎల్బో హ్యాండ్స్, రౌండ్ నెక్.. చీరకు మరింత అందాన్నిచ్చాయి. కృష్ణవర్ణపు గాజులు, నల్లపూసల హారం అదనపు ఆకర్షణ.
మోడల్: నందినీ రాయ్
కలంకారి కళ..
బాటిల్ గ్రీన్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన చీర ఇది. డిఫరెంట్ లుక్ కోసం ఫ్యాబ్రిక్‌ను క్రష్ చేశారు. జోడీగా క్రీమ్ కలర్ కలంకారీ కాటన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఎంచుకున్నారు. కాలర్ నెక్, పొడవాటి చేతులతో నిండుదనం వచ్చింది. బాడీపార్ట్ హైలైట్ అయ్యేలా పొట్లీ బటన్స్ జతచేయడంతో క్లాసీ లుక్ సాధ్యమైంది.
– రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌజ్, follow us on: retheshaareddy/
instagram.com, 8500028855,
7013639335