నందిగ్రామ్ నుంచి సువేందు నామినేషన్

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర మాజీ మంత్రి, ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేలో చేరిన కీలక నేత సువేందు అధికారి నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ దాఖలు చేశారు. సువేందు తన అనుచరులు కార్యకర్తలతో వెళ్లి అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇదిలావుంటే అధికార పార్టీ తరఫున స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జే ఈ స్థానం నుంచి రంగంలోకి దిగుతున్నారు. ఈ మేరకు గత బుధవారమే ఆమె నామినేషన్ దాఖలు చేశారు. దాంతో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ పోరు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.
కాగా, నామినేషన్ ముందు సువేందు అధికారి నందిగ్రామ్‌లోని ఓ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత హోమం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు పూర్తిగా మూసుకుపోయాయన్నారు. పరిస్థితిలో మార్పు రావాలంటే అధికార టీఎంసీని గద్దె దించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటు కంపెనీగా మారిపోయిందని, ఆ పార్టీలో దీదీ, మేనల్లుడు మాత్రమే స్వేచ్ఛగా మాట్లాడగలరని విమర్శించారు. నందిగ్రామ్‌లో విజయం తనదేనని ధీమా వ్యక్తంచేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weather Changes | ప్రపంచ దేశాల్లో దుర్భరమవుతున్న వాతావరణ పరిస్థితులు.. అధ్యయనంలో వెల్లడి..
‘వరి కొయ్యలను తగలబెట్టవద్దు’
‘ఫ్లోరోసిస్ నివారణలో మిషన్ భగీరథ నీరు కీలకపాత్ర’
Attacking BSF Jawans | బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి.. ముగ్గురు మహిళలతో సహా 10 మంది అరెస్ట్
AP News | ఈ నెల 23న ఏపీలో మేయర్లు, ఛైర్పర్సన్ల ప్రమాణస్వీకారం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

