బిల్కిస్ బానో రేప్ కేసు నిందితుల రిలీజ్ అంశాన్ని విచారించనున్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో రేప్ కేసు నిందితుల్ని ఆగస్టు 15వ తేదీన గుజరాత్ ప్రభుత్వం రిలీజ్ చేసిన అంశం తెలిసిందే. 11 మంది నిందుతులకు క్షమాభిక్ష పెట్టి విడుదల చేశారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. రేప్ నిందితుల్ని ఎలా రిలీజ్ చేస్తారని విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. 11 మంది నిందితుల రిలీజ్ అంశాన్ని విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.
నిందితుల రిలీజ్‌ను రద్దు చేయాలని కోరుతూ మహిళా హక్కుల కార్యకర్తలు సుభాషిని అలీ, రేవతి లౌల్, రూపా రేఖా వర్మలు సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనున్నది. సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్, అడ్వకేట్ అపర్ణా భట్లు ఈ కేసు తరపున వాదించనున్నారు.
బిల్కిస్ బానో రేప్ కేసు 2002లో నమోదు అయ్యింది. గోద్రా అల్లర్ల సమయంలో ఈ ఘటన జరిగింది. బిల్కిస్ బానోను రేప్ చేయడంతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడు మందిని మర్డర్ చేశారు. అయితే 2008లో ముంబైలోని సీబీఐ కోర్టు 11 మంది నిందితులకు జీవితఖైదు శిక్షను ఖరారు చేసింది. జైలు నుంచి రిలీజైన వారిలో జశ్వంత్ భాయ్ నాహి, గోవింద భాయ్ నాహి, శైలేష్ భట్, రాధేశ్యామ్ షా, బిపిన్ చంద్ర జోషి, కేసర్‌భాయ్ వోహనియా, ప్రదీప్ మోర్దియా, బకాభాయ్ వోహనియా, రాజుభాయ్ సోని, మితేష్ భట్, రమేశ్ చందన్ ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

