హెల్మెట్ ధరించినవాళ్లను దేవుడే రక్షిస్తాడు.. వీడియో చూడాల్సిందే
Helmet Safety: ఈ వీడియో చూశారా. ఇదో వింత ఘటన. కొన్ని సెకన్ల తేడాలోనే రెండుసార్లు ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఢిల్లీ పోలీసులు తమ ట్విట్టర్లో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. హెల్మెట్ పెట్టుకున్నవాళ్లను దేవుడు రక్షిస్తాడని ఆ వీడియోకు పెట్టిన క్యాప్షన్ అందర్నీ అట్రాక్ట్ చేసింది. అయితే ఇంతకీ ఏం జరిగిందో తెలిస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. రోడ్డుపై వేగంగా వస్తున్న ఓ బైకర్.. కారు నుంచి తప్పించుకోబో
న్యూఢిల్లీ: ఈ వీడియో చూశారా. ఇదో వింత ఘటన. కొన్ని సెకన్ల తేడాలోనే రెండుసార్లు ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఢిల్లీ పోలీసులు తమ ట్విట్టర్లో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. హెల్మెట్ పెట్టుకున్నవాళ్లను దేవుడు రక్షిస్తాడని ఆ వీడియోకు పెట్టిన క్యాప్షన్ అందర్నీ అట్రాక్ట్ చేసింది. అయితే ఇంతకీ ఏం జరిగిందో తెలిస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. రోడ్డుపై వేగంగా వస్తున్న ఓ బైకర్.. కారు నుంచి తప్పించుకోబోయి.. సమీపంలో ఉన్న వీధి దీపం స్తంభాన్ని ఢీకొట్టాడు. కింద పడ్డ అతను సురక్షితంగానే ఉన్నాడు.
God helps those who wear helmet !#RoadSafety#DelhiPoliceCares pic.twitter.com/H2BiF21DDD
— Delhi Police (@DelhiPolice) September 15, 2022
తలకు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల అతని ప్రాణాలకు ఏమీ కాలేదు. కానీ కిందపడి లేచేలోగానే ఆ రైడర్‌కు మరో షాక్ తగిలింది. తన బైక్ ఢీకొనడం వల్ల ల్యాంప్ పోస్టు కింద పడింది. సరిగ్గా ఆ బైకర్ లేస్తున్న సమయంలోనే అది అతని తలపై కూలింది. అయితే హెల్మెట్ ధరించి ఉండడం వల్ల లక్కీగా అతని ప్రాణాలు మిగిలాయి. అందుకే హెల్మెట్ పెట్టుకున్న వాళ్లను దేవుడు కాపాడుతాడంటూ ఢిల్లీ పోలీసులు ఆ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు. నిజానికి ఈ వీడియో చూస్తే నవ్వడం ఖాయమే అయినా.. హెల్మెట్ వల్ల ఎన్ని లాభాలు తెలిసేలా చేసింది. ఈ వీడియోకు లక్షల సంఖ్యలో లైక్‌లు కురుస్తున్నాయి.హెల్మెట్ల వల్ల 64 శాతం మరణాలను, 74 శాతం బ్రెయిన్ ప్రమాదాలను నివారించవచ్చు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

