Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఆదివారం ఎపిసోడ్ ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ వారం ఎవరూ ఎలిమినేట్ కాలేదని తెలిసినప్పటికీ, షాలిని ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున అందరినీ నమ్మించారు. చివరికి ఆమెను సీక్రెట్ రూమ్‌లోకి పంపిస్తున్నట్లు వెల్లడించి భారీ ట్విస్ట్ ఇచ్చారు.
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఆదివారం ఎపిసోడ్ ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ వారం ఎవరూ ఎలిమినేట్ కాలేదని తెలిసినప్పటికీ, షాలిని ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున అందరినీ నమ్మించారు. చివరికి ఆమెను సీక్రెట్ రూమ్‌లోకి పంపిస్తున్నట్లు వెల్లడించి భారీ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ప్రేక్షకులతో పాటు హౌస్‌లోని సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ వారం నామినేషన్లలో చివరి వరకు రోహిత్, షాలిని, వర్షిణి నిలిచారు. వీరిలో ముందుగా రోహిత్ సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో షాలిని, వర్షిణిలలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఇద్దరినీ గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బాక్సుల వద్దకు పిలిచారు. నాగార్జున సూచనల మేరకు వారు ముందుకు కదిలారు. చివరికి షాలిని ఎండ్ బాక్స్ వద్దకు చేరుకోవడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు.
తాను ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి వస్తుందని భావించిన షాలిని, రోహిత్‌ను కౌగిలించుకుని భావోద్వేగానికి గురైంది. ఆమె వెళ్లిపోతోందని భావించిన రోహిత్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ మాట్లాడుకున్నారు. ఈ సమయంలో షాలిని చేసిన వ్యాఖ్యలు కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి. “నన్ను ఎవరేమనుకున్నా పర్వాలేదు.. ఈ అమ్మాయి చాలా బ్యాడ్ అని తిట్టినా పర్వాలేదు. కానీ నువ్వొక్కడివి నన్ను అర్థం చేసుకుంటే చాలు” అంటూ రోహిత్‌తో చెప్పి భావోద్వేగానికి లోనైంది. అనంతరం హౌస్ సభ్యులకు వీడ్కోలు చెప్పి వేదికపైకి వెళ్లింది.
వేదికపైకి వచ్చిన షాలినిని నాగార్జున కొన్ని ప్రశ్నలు అడిగారు. తన స్థానంలో ఎవరెవరు ఎలిమినేట్ కావాల్సి ఉండేదని ప్రశ్నించగా, ఆమె వంశీ, సుధీర్, వర్షిణి పేర్లను చెప్పింది. వంశీ తన సొంత ఆట ఆడకుండా త్రిగుణ్ ప్రభావంలో ఉంటున్నాడని షాలిని అభిప్రాయపడింది. సుధీర్ కూడా ముకేశ్, వర్షిణిల ప్రభావంలో ఉంటున్నాడని వ్యాఖ్యానించింది. ఇక ఆటల్లో తనకంటే వర్షిణి బలహీనంగా ఉందని, ఆమె స్థానంలో తానే హౌస్‌లో ఉండేందుకు అర్హురాలినని పేర్కొంది. షాలిని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన నాగార్జున, ఎపిసోడ్ ముగిసే సమయంలో అసలు ట్విస్ట్ ఇచ్చారు. ఇంటికి వెళ్లిపోతున్న ఆమెను తిరిగి పిలిచి, “నువ్వు ఎలిమినేట్ కాలేదు” అని వెల్లడించారు. దీంతో అప్పటివరకు బాధలో ఉన్న షాలిని ఒక్కసారిగా ఆనందంతో ఉప్పొంగిపోయింది.
ప్రస్తుతం ఆమెను సీక్రెట్ రూమ్‌కు పంపిస్తున్నట్లు నాగార్జున తెలిపారు. తిరిగి హౌస్‌లోకి ఎప్పుడు వెళ్లాలనే విషయాన్ని బిగ్‌బాస్ నిర్ణయిస్తారని చెప్పారు. అయితే షాలిని నిజంగానే ఎలిమినేట్ అయిందని భావించిన హౌస్ సభ్యులకు ఈ విషయం తెలియదు. ఆమె తిరిగి ఇంట్లోకి వచ్చినప్పుడు వారి స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

