ఈ నెల 10న అగ్ర కథానాయకుడు బాలకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్‌లో ‘భోళా బాలయ్య’ అనే పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అగ్ర దర్శకుడు బోయపాటి శ్రీను ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బాలకృష్ణ అభిమానుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘ఈ పాట సంగీతం, సాహిత్యం, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. బాలకృష్ణ పుట్టినరోజును ఆయన అభిమానులు ఓ వేడుకలా చేసుకుంటారు. ఆయన కూడా అభిమానుల్ని గుండెల్లో పెట్టుకుంటారు.
బాలకృష్ణకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకంటున్నా’ అన్నారు. బోయపాటి శ్రీను సమక్షంలో ఈ వేడుకను నిర్వహించడం ఆనందంగా ఉందని, ప్రేమలో బ్రేకప్‌లు ఉండొచ్చేమోగానీ, బాలయ్యను ఒక్కసారి ప్రేమిస్తే నో బ్రేకప్స్ అని ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు అనంతపురం జగన్ అన్నారు. ఈ పాటకు ఈశ్వర్ దత్తు సంగీతాన్నందించగా.. కరీముల్లా, రుచేరా వైద్య, ఎస్.ఎం.అఫ్సర్ అలపించారు. శివాజీ వీ దర్శకత్వం వహించారు.